ఆకట్టుకుంటున్న అడవిశేష్ ‘గూఢచారి’ టీజర్
"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం "గూడచారి". అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న "గూడచారి" చిత్రం ద్వారా శశికిరణ్ తిక్క అనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అడివి శేష్ సరసన మిస్ ఇండియా, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అడివి శేష్ కథ సమకూర్చడం విశేషం.
ఆగస్టు 3న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా టీజర్ విడుదల చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "అడివి శేష్ ఈ చిత్రంలో "గూడచారి" పాత్ర పోషిస్తున్నాడు, హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. తెలుగులో ఈ మూవీ సరికొత్త స్టాండర్డ్స్ ను సెట్ చేయడం ఖాయం. ఇక ఈ చిత్రంలో కథానాయికగా మిస్ ఇండియా, మన తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ నటిస్తుండటం మరో ప్రత్యేకత' అని తెలిపారు.
ఈ చిత్రంలో అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాష్రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియ యార్లగడ్డ, అనిష్ కురువిల్ల, మధు శాలిని, రాకేష్ వెర్రె, దర్శన్ నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: శివంరావ్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: షానిల్ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ-నిర్మాత: వివేక్ కూచిబోట్ల, కథ: అడివి శేష్, నిర్మాతలు: అభిషేక్ నామా-టిజి.విశ్వప్రసాద్-అభిషేక్ అగర్వాల్, దర్శకత్వం: శశికిరణ్ తిక్క.


Click it and Unblock the Notifications











