»   » గూగుల్ ఆఫర్: అనురాగ్ కస్యప్, రెడ్లీ స్కాట్ దగ్గర పనిచేయాలని ఉందా?

గూగుల్ ఆఫర్: అనురాగ్ కస్యప్, రెడ్లీ స్కాట్ దగ్గర పనిచేయాలని ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కనపడే ప్రతీ సన్నివేశాన్ని లేదా దృశ్యాన్ని అందంగా తెరకెక్కించడం కొందరికి అలవాటు..ఆ అలవాటు మీకూ ఉంటే ఇది మీ కోసమే... అలవాటా? ఏ అంశాన్నైనా హృద్యంగా కళ్లకు కట్టేలా రూపొందిస్తారా? అయితే గూగుల్‌ మీలాంటి ప్రతిభావంతుల కోసమే ఎదురుచూస్తోంది.

దేశ జీవన చిత్రాన్ని మీ శైలిలో తెరకెక్కించి తమకు పంపాల్సిందిగా కోరుతోంది. 'ఇండియా ఇన్‌ ఏ డే'గా పిలుస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు మీరు చేయాల్సిందేంటంటే...

Google giving amateur directors a chance for making 'India in a Day' movie

అక్టోబర్‌ 10న(ఒక్కరోజు మాత్రమే) కెమేరా, ఫోన్‌ ద్వారా చిత్రీకరించిన వీడియోలు ఇక్కడ LINK లో అప్‌లోడ్‌ చేయాల్సిందిగా గూగుల్‌ విజ్ఞప్తి చేస్తోంది.

ఎంపిక చేసిన వీడియోలతో డైరెక్టర్‌ రిడ్లీ స్కాట్‌, రిచీ మెహతా, అనురాగ్‌కశ్యప్‌లు ఓ చిత్రాన్ని రూపొందిస్తారు. ఎంపికైన వారిని కో-డైరక్టర్స్‌గా గూగుల్‌ ప్రకటిస్తుంది. వీడియో నిడివితో సంబంధం లేదని... ద్విచక్రవాహనం నడపటం దగ్గరి నుంచి అమ్మను పిలవటం వరకు ఏదైనా చక్కగా తెరకెక్కిస్తే చాలని దర్శకులు రిడ్లీ స్కాట్‌ పేర్కొన్నారు. ఇందుకు సంభందించిన గూగుల్ ఇండియా వారి వీడియోని ఇక్కడ చూడండి.

English summary
Google has invited India’s amateur filmmakers to a help create a full-length user-generated movie about daily life in the country. In the project, called “India in a Day,” anyone can grab a camera or a phone to capture scenes from ordinary life on Oct. 10, and then upload their footage to http://indiainaday.withgoogle.com
Please Wait while comments are loading...