Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
ఎన్టీఆర్ ను గౌరవిస్తూ గూగుల్ ఇలా...
హైదరాబాద్: విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన జీవన, నట ప్రస్థానంలో ఎన్ని గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది. ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ డేటాబేస్ లో చేర్చింది. సిలికాన్ ఆంధ్ర డెవలప్ చేసిన ఈ ఫాంట్ లను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా డేటాబేస్ లో మరిన్ని తెలుగు ఫాంట్లు జోడించడానికి గూగుల్ ప్లాన్ చేస్తుంది. వీటిని నెటిజన్లు ఫ్రీగా ఉపయోగించవచ్చు. ఫాంట్ ల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి.
http://www.google.com/fonts/earlyaccess
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే...తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర ఈ ఫాంట్లను ఉపయోగించేందుకు ఉచితంగా అందిస్తోంది. ఎన్టీఆర్ తో పాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి విద్యా శాఖ మంత్రి మండలి వెంకట క్రిష్ణా రావు (మండలి) పేరుతో కూడా ఫాంట్ విడుదల చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఫాంట్ విడుదల చేయటం పట్ల నందమూరి ఫ్యాన్స్ తో పాటు, టాలీవుడ్ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అన్నగారుని మరోసారి తలుచుకుంటే..
తెలుగువారు "అన్నగారు" అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు.
తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు.
రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.