twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక పండగే : ‘గోపాల గోపాల’ డేట్లు ఫిక్సయ్యాయి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : వెంకటేష్, పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న ‘గోపాల గోపాల' చిత్రం జనవరి 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ఆడియోను 28న విడుదల చేయనున్నారు. వెంకటేష్ సరసన శ్రీయ కథానాయికగా నటించిన చిత్రంలో పవన్‌కళ్యాణ్ కృష్ణుడిగా కనిపిస్తాడు. ఇద్దరు పెద్ద హీరోలు కావడం, సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

    ఈ చిత్రంలో కేవలం మూడే పాటలు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఐదు నుంచి ఆరు పాటలు మన సినిమాల్లో ఉంటూంటాయి. అందులోనూ వెంకటేష్, పవన్ లాంటి వారి చిత్రాలంటే ఆడియోపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది మరీ మూడే అనేది ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. అయితే సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    Gopala Gopala Arriving on Jan 14

    హిందీ చిత్రం ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌ ఇది. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవుడంటే నమ్మకం ఓ వ్యాపారి దేవుడి బొమ్మలమ్మే బిజినెస్ చేస్తుంటాడు. భూకంపలో తన దుకాణం ధ్వంసం అవుతుంది. దేవుడి లీలల వల్ల జరిగే ఇలాంటి వాటికి ఇన్సూరెన్స్ కవర్ కాదని చెప్పడంతో...దేవుడిపై కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ.

    ఈ చిత్రంలో మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Producers of Gopala Gopala, are planning to release its audio on Dec 28 and movie on Jan 14 on the eve of first day of Sankranthi festival Bhogi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X