For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్విస్ట్ : ‘గోపాల గోపాల’ సెన్సార్ వాయిదా

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల' చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు(జనవరి 7) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో సెన్సార్ వాయిదా పడింది. దీంతో సినిమా ఎట్టి పరిస్థితుత్లోనూ జనవరి 9 విడుదలయ్యే అవకాశం లేదు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 11 లేదా, జనవరి 14న విడుదలయ్యే అవకాశం ఉంది.

  రిలీజ్ డేట్ దగ్గర పడినా....టీవీ, వార్తా పత్రికల ప్రకటనల్లో డేట్ ఖరారు చేయడం లేదు. త్వరలో...త్వరలో అని తప్ప డేట్ మాత్రం కనిపించడం లేదు. దీంతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామని ప్రయత్నిస్తున్న అభిమానులు ప్రతి రోజు థియేటర్ల చూట్టూ తిరగాల్సి వస్తోంది. డేట్ ఖరారు కాని కారణంగా అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వడం లేదు.

  కాగా చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది. సినిమాలో ఉన్నవి మూడు పాటలే అయినా రెస్పాన్స్ మాత్రం బావుంది. అన్ని సిచ్యువేషన్ సాంగులే కాబట్టి సినిమాకు ప్లస్సవుతుందని భావిస్తున్నారు. అయితే సినిమాలోని ఓ సాంగుకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

  Gopala Gopala censor postponed

  ఆడియో విడుదలకు మూడు రోజుల ముందుగానే....‘భజే భజే' సాంగ్ విడుదలై సంగతి తెలిసిందే. ఈ సాంగు గురించి ఓ గాసిప్ వినిపిస్తోంది. వాస్తవానికి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ‘టెంపర్' కోసం ఈ ట్యూన్ చేసాడట. అయితే ఆ ట్యూన్ ఆ సినిమాకు సూట్ కాక పోవడంతో వాడలేదట. ఆ ట్యూన్లో కొన్ని మార్పులు చేసి, కొత్తవి మేళవించి భక్తి రసానికి సింక్ అయ్యేలా ‘గోపాల గోపాల'లో సెట్ చేసారట.

  'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. దొంగ స్వామీగా చేసిన పోసాని తనదైన స్పెషల్ డైలాగు డెలవరితో అదరకొట్టాడని, త్వరలో ఆయన డైలాగుతో టీజర్ వదిలే అవకాసం ఉందని అంటున్నారు.

  మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

  English summary
  It’s really shocking. The scheduled Censoring of Pawan-Venky’s film “Gopala Gopala” is not happening as planned. As the producers Suresh Babu and Sarath Marar failed to get the final copy of the movie as expected, the Censoring got cancelled.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X