For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యు ట్యూబ్ లో ...‘గోపాల గోపాల’ ఇంకో రికార్డు

  By Srikanya
  |

  హైదరాబాద్ : వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా గోపాల గోపాల . ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనంరేపుతుంది. గత ఆదివారం ఈ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా విడుదలైన ఈ ట్రైలర్ వెనువెంటనే యు ట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం మొదలుపెట్టింది.

  అలాగే ఈ ట్రైలర్ అజిత్ ‘ఎన్నై అరిందినాల్' ట్రైలర్ ని పక్కకు నెట్టి వ్యూస్ కౌంట్ లో టాప్ పొజిషన్ కూర్చుంది. దీన్ని చూసిన వారి సంఖ్య ఇప్పటికే 5లక్షల మందిని దాటగా తెలుగులో అత్యధిక హిట్లు వచ్చిన ట్రైలర్ గా నిలిచింది

  దర్శకుడు కిషోర్‌ పార్థసాని(డాలీ) మాట్లాడుతూ... " అప్పుడప్పుడు మాటల సందర్భంలో 'మీకు సమాధానం చెప్పాలంటే ఆ దేవుడే దిగిరావాలి బాబూ...' అంటుంటాం సరదాగా! అయితే నిజంగానే ఒక భక్తుడి సందేహాల్ని నివృత్తి చేయడానికి ఆ దేవుడు దిగొచ్చాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణావతారంలో. మరి కళ్లముందు కనిపించిన ఆ దేవుడితో భక్తుడు ఏం మాట్లాడాడో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే" అన్నారు.

   Gopala Gopala is top trending video on Youtube

  నిర్మాతలు మాట్లాడుతూ.. ''దేవుడినే సవాల్‌ చేసిన ఓ భక్తుడి కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి పంచే వినోదాలు అందరికీ నచ్చుతాయి''అని చెప్తున్నారు.

  పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ ఓ మైగాడ్ రీమేక్. ఈ చిత్రంఒరిజనల్ లో అక్షయ్ కుమార్ ఓ బైక్ మీద వచ్చి హల్ చల్ చేస్తాడు. ఇప్పుడు అదే టైప్ లో పవన్ సైతం ఓ స్పెషల్ బైక్ లో వస్తారు. ఆ బైక్ డిజైన్ మీరు చూస్తున్నదే. అది ఇటీవలే బయిటకు వచ్చింది. దానిపై ఓమ్ ...786 అని ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా పీఆర్ఓ ఈ బైక్ పేరు. భారీ ఆకారంతో భారీ సీసి ఉన్న బైక్ ఇది. సినిమా రిలీజయ్యాక ఈ బైక్ గురించి చాలా కాలం అభిమానులు మాట్లాడుకుంటారని అంచనా వేసి మరీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ ఈ బైక్ ని ఇలా డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000.

  ఇక ఈ చిత్రంలో పవన్‌ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఈ చిత్రంలో శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు, శరత్‌మరార్‌. సురేష్‌బాబు నిర్మాతలు.

  English summary
  ‘Gopala Gopala’ is now in first position in India’s Top Trending videos on Youtube, displacing Ajith’s ‘Yennai Arindhal’ from the first place. The Teaser’s view count is almost at the 5Lakh views mark right now and it is expected to become one of the highest watched Telugu teasers of the year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X