Just In
- 37 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 42 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓ లుక్కేయండి: ఫోటోల్లో ‘గోపాల గోపాల’ టోటల్ మూవీ!
హైదరాబాద్: హిందీలో హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో ‘గోపాల గోపాల' చిత్రంగా రీమేక్ చేసారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్ష్కుల ముందుకు వస్తోంది. హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పాత్రను వెంకటేష్ పోషించారు.
https://www.facebook.com/TeluguFilmibeat
తాజాగా ‘గోపాల గోపాల' ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ డిజైన్స్ విడుదల చేసారు. ఈ ఫోటోలు చూస్తూ దాదాపుగా సినిమా మొత్తం అర్థం అవుతుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. విశ్వంలో సంభవించే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. సృష్టించేది దైవమే, నశింపజేసేదీ దైవమే. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఇలా ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. మరి అలాంటప్పుడు మనిషి బాధలకు బాధ్యుడు దైవం కాక ఇంకెవరు? అని ప్రశ్నిస్తాడో సామాన్యుడు. ప్రకృతి విలయాన్ని సృష్టించి తన జీవనోపాధిపై దెబ్బకొట్టిన దైవంపై కోర్టుకెక్కాడు.
దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. మరి అభియోగం మోపబడ్డ దైవం ఏం చేసింది? ఆ వ్యక్తికి న్యాయస్థానంలో న్యాయం జరిగిందా? ఆసక్తికరమైన ఈ కథాంశంతో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం 'ఓ మైగాడ్'. దేవునిపై కోర్టుకెక్కిన సామాన్యుడి పాత్రలో పరేశ్‌రావల్ జీవిస్తే, దైవంగా అక్షయ్‌కుమార్ అదరహో అనిపించేశారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ తెరపై వచ్చిన అమోఘమైన ప్రయోగం 'ఓ మైగాడ్'.
ఈ కథను తెలుగీకరించాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. ఈ విషయంలో నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ను అభినందించాల్సిందే. ఇందులో పరేశ్‌రావెల్ పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను పవన్‌కల్యాణ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. సవాల్‌గా తీసుకొని వీరిద్దరూ ఈ పాత్రల్ని పోషించారనితెలిసింది. కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, తడాఖా చిత్రాల దర్శకుడు డాలీ ఈ చిత్రానికి దర్శకుడు. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలిసింది. మాతృకలో చేసిన పాత్రనే ఇందులో మిథున్ చక్రవర్తి పోషించారు.
స్లైడ్ షోలో ఫోటోలు....

సామాన్య వ్యాపారి
దేవుడి బొమ్మల వ్యాపారం చేసే వ్యాపారి పాత్రలో వెంకటేష్ నటించారు. కానీ అతనికి దేవుడిపై పెద్దగా నమ్మకం ఉండదు.

చక్కనైన ఫ్యామిలీ
వెంకటేష్, శ్రీయ చక్కిన ఫ్యామిలీగా నటించారు. వారి పాత్రలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

సంతోషాల హరివిల్లు
వారి ఇల్లు ఎప్పుడూ సంతోషాల హరి విల్లులా ఉంటుంది. కానీ అనుకోని సంఘటన వారిని ఇబ్బందుల్లో పడేస్తుంది.

ఇన్సూరెన్స్ డబ్బులు రావు
ప్రకృతి విలయం వల్ల తన షాపుకు నష్టం జరిగిందనే కారణంతో ఇన్సూరెన్స్ కంపెనీ వారు పరిహారం ఇవ్వరు. దీంతో దేవుడిపై కేసు వేస్తాడు. వారి దూతలుగా చెప్పుకునే స్వామిజీలను కోర్టుకు లాగుతాడు.

తానే లాయర్ అవతారం ఎత్తి
ఈ సినిమాలో వెంకటేష్ తన కేసును వాదించుకోవడానికి తానే లాయర్ అవతారం ఎత్తుతాడు.

పోసాని, ఆశిష్ విద్యార్థి
పోసాని కృష్ణ మురళి ఈ చిత్రంలో దొంగ స్వామీజీ పాత్రలో....ఆశిష్ విద్యార్థి దొంగ స్వామీజీల తరుపున వాదించే లాయర్ పాత్రలో నటించారు.

దొంగ స్వామీజీల హెడ్
హిందీ వెర్షన్లో చేసిన పాత్రనే...తెలుగు వెర్షన్ లోనూ చేసాడు మిధున్ చక్రవర్తి.

ఆసక్తికరం
మిధున్ చక్రవర్తి, వెంకటేష్ మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.

యాంకర్
న్యూస్ ఛానల్ చానల్ యాంకర్ పాత్రలో మధుశాలిని నటించింది.

పవన్ లుక్
సినిమాలో పవన్ లుక్ గత సినిమాలకు డిపరెంటుగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

మార్పు...
పరమాత్ముడి రూపంలో పవన్ కళ్యాణ్....వెంకీకి కనువిప్పు కలిగిస్తాడు.

బామ్మలతో..
సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ ఆసక్తిరంగా నటించారు. అందుకు ఈ ఫోటయే నిదర్శనం.

భక్తుడిగా...
సినిమాపై పెద్దగా నమ్మకం లేని వెంకీ చివరకు భక్తుడిగా మారిపోతాడు.

వెంకీకి అండగా...
సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఆద్యంతం వెంకీకి అండగా ఉంటుంది.

సాహసం
పలు సాహసాలతో వెంకీని ఆశ్చర్య పరిచే విధంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుంది.

లుక్ అదుర్స్
గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాన్ లుక్ అదిరిపోయే విధంగా ఉంటుంది.

శ్రీకృష్ణుడి లీలలు
సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర శ్రీకృష్ణుడి లీలలను గుర్తు చేస్తాయి.

వెంకీ లుక్
వెంకటేష్ లుక్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

డాన్స్ అదరగొట్టారు
సినిమాలోని ఓ పాటలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ డాన్స్ అదరగొట్టారు.

డోల్
సాంగులో భాగంగా డోలు వాయిస్తున్న పవన్, వెంకీ. అభిమానులను ఉత్సాహ పరిచే విధంగా ఈ పాట ఉంటుంది.

వావ్
పవన్ కళ్యాణ్, వెంకటేష్ జోడి తొలిసారి అయినా...వావ్ అనిపించే విధంగా ఉంటుంది.

కృష్ణార్జునులు
భారతంలో అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసిన విధంగా పవన్ పాత్ర ఉంటుంది.