»   » ‘గోపాలా గోపాలా’ రిలీజ్ డేట్: పవన్ కళ్యాణ్ లుక్ ఇలానే..!

‘గోపాలా గోపాలా’ రిలీజ్ డేట్: పవన్ కళ్యాణ్ లుక్ ఇలానే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న 'గోపాలా గోపాలా' చిత్రం షూటింగ్ వేగం పుంజుకుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ కావడంతో ఫుల్ స్వింగ్‌తో పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భగవంతుడైన గోపాల కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నారు.

దీంతో ఇంటర్నెట్లో పవన్ కళ్యాణ్ గోపాలుడి గెపట్‌లతో కూడిన క్రియేటివ్ ఇమేజెస్ దర్శనం ఇస్తున్నాయి. పలువురు అభిమానులు, ఔత్సాహికులు పవన్ కళ్యాణ్‌ను గోపాల కృష్ణుడిగా ఫోటో మార్ఫింగ్ చేసి హడావుడి చేస్తున్నారు. మరో ఆసర్తికర విషయం ఏమిటంటే ఈచిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈచిత్ర ప్రారంభోత్సవం జరిగింది.

హిందీ వెర్షన్ 'ఓ మై గాడ్' చిత్రంలో ప్రభుదవా, సోనాక్షి సిన్హా స్పెషల్ సాంగు చేసి అదరగొట్టారు. అదే రేంజిలో తెలుగు వెర్షన్‌లోనూ ఐటం సాంగు ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రియమణితో కలిసి ఏ ఒక్క సినిమాలోనూ పని చేయలేదు. ఎందుకో తెలియదు కానీ ఆమెపై తెగ ఆసక్తి చూపుతున్నారట పవన్ కళ్యాణ్. అసలు విషయంలోకి వెళితే... 'గోపాలా గోపాలా' చిత్రంలో స్పెషల్ సాంగు ఎవరితో చేయించాలనే అంశంలో ప్రియమణి అయితే బెటరనే ఆలోచనలో ఉన్నారట.

Gopala Gopala release date Oct 23

వెంకీ సరసన 'శ్రియ' నటిస్తుండగా ప్రధాన పాత్రలలో..మిదున్ చక్రవర్తి, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షా పంత్, నర్రా శీను, రమేష్ గోపి, అంజు అస్రాని నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే: కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు : సాయి మాధవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ : సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ : పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ : వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్, దర్శకత్వం: డాలి.

English summary

 Gopala Gopala featuring Venkatesh and Pawan Kalyan in the leads. Kishore Pardasany (Dolly) is going to direct the film and it’s being jointly produced by Suresh Babu and Sharath Marar. Anup Rubens has been roped in to score the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu