»   »  అలా వద్దనే: శ్రీను వైట్ల-కోన కలిసారు, గోపీ మోహన్ లేఖ

అలా వద్దనే: శ్రీను వైట్ల-కోన కలిసారు, గోపీ మోహన్ లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీను వైట్ల-కోన వెంకట్-గోపీ మోహన్ కాంబినేషన్లో సినిమా అంటే అందులో ఎంటర్టెన్మెంటుకు లోటుండదు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు హిట్టయ్యాయి. అయితే ‘దూకుడు' సినిమా సమయంలో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆ తర్వాత నుండి శ్రీను వైట్ల-కోన వెంకట్-గోపీ మోహన్ కలిసి పని చేయడం లేదు. త్వరలో రామ్ చరణ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో ఈ ముగ్గురూ కలిసి పని చేయబోతున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ గోపీ మోహన్ సోషల్ వీడియా ద్వారా లేఖ వదిలారు. ఆ లేఖ వివరాలు క్రింద ఉన్నాయి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మమ్ముల్ని ఆదరిస్తున్న సినీ ప్రియులకు నమస్కారాలు, నేను,కోన గారు కలిసి చేస్తున్న కధలు,సినిమాల విశేషాలు మీతో పంచుకోవాలని అనిపించింది.

అనిల్ సుంకర గారి ఎకె ఎంటర్టెన్మెంట్స్‌లో సునీల్ హీరోగా నా దర్శకత్వం లో నేను,కోన గారు కలిసి ఒక విభిన్నమైన కధని రూపొందించడం జరిగింది. దిల్ రాజు, వాసు వర్మ, సునీల్ సినిమా తో పాటు మా సినిమా కూడా పార్లల్ గా షూటింగ్ జరుపుకుంటుంది. రఫ్ గా మార్చ్ ఎండ్/ఏప్రిల్ లో మొదలవుతుంది.

Gopi Mohan open letter to movie lovers

లౌక్యం దర్శకుడు శ్రీవాసు దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ గారి కోసం ఎంటర్టెన్మెంటుతో కూడిన హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ కధని రూపొందించడం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో మిగతా వివరాలు అనౌన్స్ చెయ్యడం జరుగుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శ్రీనువైట్ల డైరెక్షన్లో దానయ్య గారి బ్యానర్ లో త్వరలో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ కి కూడా మేము కధని అందిస్తున్నాం. పదేళ్ళు కలిసి పనిచేసిన మేము(వైట్ల గారు,కోన గారు,నేను), కొన్ని అనివార్య కారణాల వల్ల గత సంవత్సరం కలిసి పనిచెయ్యలేకపోయాం. దానికి కారణాలు అనేకం. జరిగిన దానికి ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునే సంస్కృతి నుండి బయటపడి, అందరి హీరోలతో జనరంజకమైన సినిమాలకి పనిచెయ్యాలని ఆశిస్తున్నాము. హీరో రామ్ చరణ్ ఉన్నత మనసుతో కోన గారిని, వైట్ల గారిని కలిపిన విధానం అభినందించదగినది.

మా కలయికలో రాబోయే రామ్ చరణ్, సమంతల నూతన చిత్రం చాలా మంచి కధతో, శ్రీను వైట్ల గారి సినిమాలకి భిన్నమైన కొత్త కధనంతో రూపకల్పన జరుగుతోంది.మా మార్కు మంచి హాస్యము ఉంటుంది. శ్రీను వైట్ల గారు, మా కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం గారి పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇదివరకు సినిమాల ఛాయలు ఎక్కడా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.

రామ్ చరణ్ మాతో ఎంతో ఇష్టపడి గత 6 నెలలుగా చేయించుకుంటున్న ఇంకో సబ్జెక్టు కూడా ఈ సినిమా తదనంతరం మొదలవుతుంది.అన్నీ ఖరారు అయ్యాక మిగతా వివరాలు అనౌన్స్ చేస్తారు.

బెస్ట్ విషెస్ టు ఆల్.
మీ
గోపీమోహన్

English summary
Gopi Mohan open letter to movie lovers about Srinu Vaitla and Kona Venkat teams up again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu