»   » అవి పెళ్లయ్యాక వచ్చిన మార్పులు : గోపీచంద్

అవి పెళ్లయ్యాక వచ్చిన మార్పులు : గోపీచంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రీసెంట్ గా పెళ్లైన హీరో గోపీచంద్. ఆయన తన వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తోందని చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ.... చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి భార్య కావాలనుకొన్నానో.. అలాంటి అమ్మాయే నా జీవితంలోకి వచ్చింది. రేష్మ అభిరుచులూ నా అభిరుచులూ కలిశాయి. చాలా విషయాల్లో ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం అన్నారు.

అంతేకాదు.. అన్నింటికంటే ముఖ్యంగా సంప్రదాయం తెలిసిన అమ్మాయి. పూజలు, పునస్కారాలూ అన్నీ తెలుసు. అన్నింటికంటే రేష్మ చేతి వంట బాగుంటుంది అంతకు ముందు కాస్త ఒంటరిగా అనిపించేది. నా కోసం ఒకరు, ఒకరి కోసం నేను ఎదురుచూడడం... ఇదంతా బాగుంది. ఇదంతా పెళ్లైయ్యాక వచ్చిన మార్పులు అన్నారు గోపీచంద్.

ఇక తనూ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చింది కదా. సినిమాలన్నీ చూస్తుంది. పెళ్లికి ముందు నా సినిమాలు చూసిందో లేదో గానీ, ఇప్పుడు మాత్రం వాటితోనే కాలక్షేపం చేస్తోంది. 'మొగుడు' సినిమా తనకి బాగా నచ్చిందట. ఇద్దరం కలిసి సినిమాలేం చూళ్లేదు. 'సాహసం' చూడాలి అన్నారు.

తన తాజా చిత్రం 'సాహసం' గురించి చెప్తూ...'మోసగాళ్లకు మోసగాడు' నుంచి 'టక్కరి దొంగ' వరకూ ఇలాంటి కథలు వచ్చిన మాట నిజమే. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. కథని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. పైగా... చంద్రశేఖర్‌ యేలేటి వాస్తవికతకు దగ్గరగా వెళ్లే దర్శకుడు. ఈ సినిమాలో నమ్మలేని సాహసాలేం ఉండవు. 'ఇలా జరగొచ్చు' అని ప్రేక్షకులు అనుకునేలానే ఉంటాయి. చివరి 40 నిమిషాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ తప్పకుండా ఆకట్టుకుంటాయి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో తెలుగులో అలాంటి సన్నివేశాలు చూసుండరు అని చెప్పారు.

English summary

 Hero Gopichand said that he is very much happy with his marriage life. Talking about His wife Reshma he admits that she is a good life partner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu