twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒత్తిడి ఉంటే డ్రగ్స్ వాడుతారా? టాలీవుడ్‌లోనే కాదు.. సాఫ్ట్‌వేర్‌లోను ఉంది.. గోపిచంద్

    హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న డ్రగ్ మాఫియాపై టాలీవుడ్ హీరో గోపిచంద్ స్పందించారు. డ్రగ్ వినియోగం సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు. ఆయన నటించిన గౌతమ్ నందా చిత్రం ఈ నెల 28న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ

    By Rajababu
    |

    హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న డ్రగ్ మాఫియాపై టాలీవుడ్ హీరో గోపిచంద్ స్పందించారు. డ్రగ్ వినియోగం సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు. ఆయన నటించిన గౌతమ్ నందా చిత్రం ఈ నెల 28న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర వివరాలతోపాటు, తన వ్యకిగత విషయాలను, డ్రగ్స్‌కు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాన్ని గోపిచంద్ వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారంపై చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    స్టేట్‌లోనే హాట్ టాపిక్..

    స్టేట్‌లోనే హాట్ టాపిక్..

    డ్రగ్స్ మాఫియా అంశం కేవలం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ కాదు. బేసిగ్గా రాష్ట్రానికి సంబంధించిన హాట్ టాపిక్. ఇది వ్యవహారం కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. ఇతర వర్గాలకు కూడా సంబంధముందనేది పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కాబట్టి సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదన్నది నా అభిప్రాయం.

    Recommended Video

    Puri Wife Lavanya Fires Over Charmi Puri Relation
    కఠిన చర్యలు తీసుకోవాలి..

    కఠిన చర్యలు తీసుకోవాలి..

    డ్రగ్స్ అనేది మంచిది కాదు. దానిని అరికట్టాల్సిన బాధ్యత, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. డ్రగ్స్ అమ్మకాలు హైదరాబాద్ స్కూళ్ల సమీపంలో జరుగున్నదనేది ఆందోళనకరమైన అంశం. ఇది మంచిది కాదు. పిల్లలు ఒక్కరు పాడైపోతే.. కుటుంబం మొత్తం నాశనం అవుతుంది.

    ఒత్తిడితోనే డ్రగ్స్ వినియోగం..

    ఒత్తిడితోనే డ్రగ్స్ వినియోగం..

    ఒత్తిడి వల్లే సినీ ప్రముఖులు డ్రగ్స్ బారిన పడుతున్నారన్న వాదనను గోపిచంద్ ఖండించారు. ఒత్తిడి ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఉంది. బిజినెస్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. క్రీడల్లోనూ ఉంటుంది. ఒత్తిడి అనేది అన్ని రంగాల్లో పనిచేసే వారిపై ఉంటుంది. అందుకని డ్రగ్స్ వాడటం సరికాదు.

    డ్రగ్స్ ఓ బలహీనత..

    డ్రగ్స్ ఓ బలహీనత..

    డ్రగ్స్ వాడటం అనేది ఓ బలహీనత. అలాంటి బారిన పడితే జీవితం నాశనం అవుతుంది. డ్రగ్స్ వినియోగం వల్ల లాభం ఏమి ఉండదు ఒత్తిడిని నుంచి బయటపడటానికి మంచి సినిమాలు చూడాలి. ఎక్సర్‌సైజులు చేయాలి. జిమ్‌కు వెళ్లాలి. మంచి పుస్తకాలు చదువాలి. అంతేకాని డ్రగ్స్ వాడుతారా అని గోపిచంద్ అన్నారు.

    English summary
    Actor Gopichand's latest movie is Gautam Nanda. Hansika, Catherine tresa are lead pair. This movie releasing on 28th July. In this occassion, Gopichand talks about his forthcoming film Gautam Nanda movie and his Character, Director Sampath Nandi taking.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X