»   » తమన్ చేతిలోనే ఇక అంతా.. అలా జరగడం పొరపాటే.. గౌతమ్‌నందా గురించి గోపిచంద్ (ఇంటర్వ్యూ)

తమన్ చేతిలోనే ఇక అంతా.. అలా జరగడం పొరపాటే.. గౌతమ్‌నందా గురించి గోపిచంద్ (ఇంటర్వ్యూ)

Written By:
Subscribe to Filmibeat Telugu

విభిన్న పాత్రలను, సినిమాలను ఎంచుకోవడంలో గోపిచంద్‌ది ప్రత్యేకమైన శైలి. విలన్‌గా, హీరోగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. గోపిచంద్ నటించిన చివరి చిత్రాలు జిల్, సౌఖ్యం. ఆ చిత్రాల తర్వాత దాదాపు ఏడాదికిపైగా గ్యాప్ వచ్చింది. గతేడాది గోపిచంద్ సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఆయనకు, ప్రేక్షకులకు మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడింది.

గోపిచంద్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన నటించిన గౌతమ్‌నంద చిత్రం విడుదలకు ముస్తాబైంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక, క్యాథరిన్ కథానాయికలు. ఈ చిత్రం జూలై 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫిల్మీబీట్‌తో జరిపిన ముచ్చట ఆయన మాట్లాల్లోనే..


డబ్బింగ్ చెప్తున్నప్పడు నమ్మకం పెరిగింది

డబ్బింగ్ చెప్తున్నప్పడు నమ్మకం పెరిగింది

గౌతమ్‌నందా చిత్రంలో గౌతమ్ పాత్రలో నటిస్తున్నాను. కథ బాగా నచ్చింది. కథ ఎలా అయితే చెప్పారో అలానే తెరపైనాకెక్కించారు దర్శకుడు. డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా కాన్ఫిడెన్స్ కలిగింది. అందుకే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఈ కథ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే అయ్యింది. నేను చాలా సినిమాలు సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశాను.


Goutham Nanda Movie Audio Launch : Udaya Bhanu Got Shocked
యాక్షన్ లేకుండా సినిమాలు చేయను

యాక్షన్ లేకుండా సినిమాలు చేయను

యాక్షన్ లేకుండా నేను సినిమాలు చేయను. నేను నటించే సినిమాలో యాక్షన్ భాగంగా ఉంటుంది. కొంతైనా యాక్షన్ ఉండాలి. అందుకే ఆరడుగుల బుల్లెట్, ఆక్సిజన్ చేశాను. దర్శకుడు సంపత్ నంది కథ చెప్పడానికి వచ్చినపుడు ఆయన రూపొందించిన సినిమాలు చూశాను. సంపత్ నంది సినిమాలో హీరోను ఎలివేట్ చేసే సీన్లు చాలా ఉంటాయి. నాకు బాగా ప్లస్ అవుతుందనే అభిప్రాయంతో ఉన్నాను. కానీ కథ చెప్పిన తర్వాత ఆయన తీసిన సినిమాల కంటే భిన్నంగా ఉంది అనిపించింది. బేసిగ్గా సినిమా కథలోనే బలం ఉంది. అందుకే ఈ సినిమాను ఇష్టపడి చేశాను.


నేను ఎవరిని అనే పాయింట్‌తో

నేను ఎవరిని అనే పాయింట్‌తో

కథ గురించి చెపితే మజా ఉండదు. కథ ప్రధానంగా హూ అయామ్ ఐ (నేను ఎవర్ని) అనే పాయింట్‌ ఆధారంగా రూపొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఎవరినీ అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి ఉంది. అందుకే ఈ కథ ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో నేను రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాను. గౌతమ్ అనే వ్యక్తి గౌతమ్ నందగా ఎలా మారాడు అనే ఈ కథ.


ఏడాదిపాటు సినిమాలు రాకపోవడం..

ఏడాదిపాటు సినిమాలు రాకపోవడం..

గతేడాది ప్రేక్షకులకు దూరమయ్యాను. నేను నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు. ప్లానింగ్‌‌లో తేడా జరిగింది. కెరీర్‌లో ఓ సంవత్సరాన్ని కోల్పోవడం అటే పెద్ద పొరపాటే. ఇక అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అనుకొంటున్నాను. ఈ చిత్రం నిర్మాణం విషయానికి వస్తే అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువైందనే సరికాదు. కథ విన్నాక నిర్మాతలతో సంప్రదింపులు జరిపి అన్ని ఆలోచించుకొన్న తర్వాతనే బడ్జెట్ ఫిక్స్ చేశాం. అనుకొన్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం.


తమన్ రీరికార్డింగ్‌ను బట్టి..

తమన్ రీరికార్డింగ్‌ను బట్టి..

కథను ఎలా అనుకొన్నామో అలా వచ్చింది. అన్ని సరిగ్గానే కుదిరాయి. ఇక ఈ సినిమా తమన్ చేతిలో ఉంది. తమన్ చేసే రీరికార్డింగ్ చేయడాన్ని బట్టి సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది. ఈ చిత్రంలో హన్సిక, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వారిద్దరి గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుంది. తెరమీద వారితో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. డెఫినెట్‌గా సినిమాను అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు.


సంపత్ నంది బాగా వర్కవుట్ చేశారు..

సంపత్ నంది బాగా వర్కవుట్ చేశారు..

సంపత్‌ వర్కింగ్ స్టయిల్ బాగా నచ్చింది. దాంతో మా మధ్య అవగాహన ఏర్పడింది. కథ, సాంకేతిక అంశాలకు సంబంధించి అతను చాలా క్లియర్‌గా ఉంటాడు. కథ చెప్పడానికి ముందే నా గురించి కొంత వర్క్ చేశాడు. మరుసటి రోజే నా గెటప్‌కి సంబంధించిన స్కెచ్‌లు వేయించి తీసుకొచ్చాడు. నా హెయిర్ స్టయిలిస్ట్‌తో కలిసి నా గెటప్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు. అప్పుడే అనిపించింది సినిమాను బాగా తీస్తాడు అనే భావన కలిగింది.


అవి లేకుండా సినిమాలు తీయడం రిస్క్

అవి లేకుండా సినిమాలు తీయడం రిస్క్

కమర్షియల్ అంశాలు లేకుండా సినిమాలు తీయడం చాలా రిస్క్. నా కోసం సినిమాలు ఉండాలని నేను కోరుకోను. నా అభిరుచి కోసం నిర్మాత కష్టాన్ని పణంగా పెట్టను. నిర్మాత ప్రయోజనాలు నాకు చాలా ముఖ్యం.


సినిమా అంటే చాలా మంది జీవితాలు

సినిమా అంటే చాలా మంది జీవితాలు

సినిమా అంటే చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. పంపిణీదారులు, ప్రదర్శనకారులు చాలా మంది మాపై నమ్మకంతో సినిమాని కొంటారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. పంపిణీదారులు నష్టపోతే మన మీద నమ్మకం పోతుంది. ఈ సినిమా గ్యారంటీగా మంచి చిత్రం అవుతుంది.English summary
Actor Gopichand's latest movie is Gautam Nanda. Hansika, Catherine tresa are lead pair. This movie releasing on 28th July. In this occassion, Gopichand talks about his forthcoming film Gautam Nanda movie and his Character, Director Sampath Nandi taking.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu