»   » ‘ఘట్టమనేని గౌతమ్’గా గోపిచంద్.. మహేశ్ కొడుకుకు పేరుతో సంబంధేమేమిటి?

‘ఘట్టమనేని గౌతమ్’గా గోపిచంద్.. మహేశ్ కొడుకుకు పేరుతో సంబంధేమేమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్‌ అన్న సంగతి అందరికి తెలిసిందే. అతడి పేరుకి హీరో గోపిచంద్‌కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఈ సినిమా పేరుకు గౌతమ్‌కు సంబంధమేమిటీ? గోపిచంద్ నటిస్తున్న గౌతమ్‌నంద చిత్రంలో హీరో పాత్ర ఘట్టమనేని గౌతమ్. హీరోకు అలాంటి పేరు పెట్టి ప్రేక్షకుల్లో ఓ ఆసక్తిని రేపాడు దర్శకుడు సంపత్ నంది. ఈ చిత్రం జూలై 28న రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో గోపిచంద్ మాట్లాడుతూ.. ఆ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బిలియనీర్ల కుమారులపై రీసెర్చ్

బిలియనీర్ల కుమారులపై రీసెర్చ్

గౌతమ్‌నంద చిత్రంలో హీరో పాత్ర కోసం బిలియనర్ల కుమారులపై దర్శకుడు ప్రత్యేకంగా పరిశోధన చేశారు. సంపన్న వ్యాపారవేత్తలకు సంబంధించిన పిల్లల ప్రవర్తన, అలవాట్లు, వేషభాషలపై అవగాహన కల్పించుకొన్న తర్వాతనే గౌతమ్‌నంద చిత్రంలో పాత్రను పక్కాగా డిజైన్ చేశారు. ఆ పాత్రకు ఘట్టమనేని గౌతమ్ అని పేరు పెట్టడం దర్శకుడి నిర్ణయం. ఆ విషయంపై నాకు పెద్దగా వివరాలు తెలియవు అని గోపిచంద్ చెప్పారు.


Goutham Nanda Movie Audio Launch : Udaya Bhanu Got Shocked
కథానాయికలుగా హన్సిక, క్యాథరిన్

కథానాయికలుగా హన్సిక, క్యాథరిన్

ఈ చిత్రంలో హన్సిక, క్యాథరిన్ ఇద్దరు హీరోయిన్లు. హన్సిక క్యారెక్టర్ పేరు స్ఫూర్తి. చాలా ఎక్కువగా మాట్లాడే పాత్ర హన్సికది. బయట కూడా ఆమె నేచర్ అలాగే ఉంటుంది. బాగా మాట్లాడుతుంది. క్యాథరిన్‌ది రిచ్ అమ్మాయి పాత్ర. చాలా పొగరుబోతు లక్షణాలు ఉంటాయి. ఇద్దరు హీరోయిన్ల సెలక్షన్ కూడా ఫర్‌ఫెక్ట్‌గా అనిపిస్తుంది.


రమణ మహర్షి ఫిలాసఫీ..

రమణ మహర్షి ఫిలాసఫీ..

అధ్యాత్మిక గురువు రమణ మహర్షి ఫిలాసఫీలోని ఓ పాయింట్ ఆధారంగా గౌతమ్‌నంద చిత్రం రూపొందింది. ప్రతీ మనిషి తాను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తండ్రి పేరు, తాత పేరు చెప్పుకోని తమ గుర్తింపును కాకుండా మనం ఎవరు అనే ప్రశ్న వేసుకొనే విధంగా ఈ చిత్ర కథ ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది.


భాషాతో సంబంధం లేదు..

భాషాతో సంబంధం లేదు..

గౌతమ్‌నంద చిత్రంలో రెండు కోణాలున్న పాత్ర నాది. దాంతో రజనీకాంత్ నటించిన భాషా చిత్రం మాదిరిగా ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ భాషాకు గౌతమ్‌నందకు ఎలాంటి పోలీకలు ఉండవు. ఈ చిత్ర కథ డిఫరెంట్‌గా ఉంటుంది అని గోపిచంద్ తెలిపారు.


English summary
Actor Gopichand's latest movie is Gautam Nanda. Hansika, Catherine tresa are lead pair. This movie releasing on 28th July. In this occassion, Gopichand talks about his forthcoming film Gautam Nanda movie and his Character, Director Sampath Nandi taking.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu