»   » గోపీచంద్ ‘బల్లెం’.... ఎవర్ని ఏసేయడానికో?

గోపీచంద్ ‘బల్లెం’.... ఎవర్ని ఏసేయడానికో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గోపీచంద్ హీరోగా ఇటీవల విడుదలైన ‘సౌఖ్యం' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ ప్లాప్ గా నిలిచింది. గతంలో గోపీచంద్ లౌక్యం చూసి.... ఈ సినిమా బావుంటుందని వెళ్లిన ప్రేక్షకును రోటీన్ మసాలాతో ప్రేక్షకులను ఓ వేటు వేసారు.

గోపీచంద్ హీరోగా మరో సినిమా రాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘బల్లెం' అని తెలుస్తోంది. గతంలో గోపీచంద్ హీరోగా ‘జగన్మోహన్ ఐపీఎస్' అనే చిత్రం తమిళ దర్శకుడు భూపతి పాండియన్ తో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్.

కొన్ని వివాదాల కారణంగా ఆ సినిమా నుండి భూపతి పాండ్యన్ తప్పుకోవడంతో బి గోపాల్ దర్శకత్వంలో మిగిలిన సినిమా షూట్ చేసారు. అయితే ఇది కూడా పూర్తి కాకుండా 90 శాతం సినిమా పూర్తయ్యాక ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోయింది.

 Gopichand next movie title Ballem

ఇపుడు ఇదే సినిమాను పూర్తి చేసి.... పాత టైటిల్ తో కాకుండా ‘బల్లెం' అనే కొత్త టైటిల్ తో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ అపజయాలకు కళ్లెం పడుతుందో చూడాలి.

మరో వైపు గోపీచంద్ హీరోగా....‘ఆక్సీజన్' అనే చిత్రం రాబోతోంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్ రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఐశ్వర్య నిర్మిస్తోంది. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలను అందిస్తారు. విలన్ గా జగపతిబాబు నటిస్తున్నారు. హీరోయిన్ గా రాశీఖన్నా ఎంపికైంది. ‘జిల్‌' తరవాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కిక్‌ శ్యామ్‌, అలీ, అను ఎమ్మానియేల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెట్రి, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి.

English summary
Tollywood actor Gopichand next movie title Ballem.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu