»   » స్టైలిష్ గా: గోపీచంద్ 'జిల్' టీజర్(వీడియో)

స్టైలిష్ గా: గోపీచంద్ 'జిల్' టీజర్(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యు.వీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా గా మిర్చి చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ తాజాగా గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నా హారోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్రశేఖర్ ఏలేటి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి 'జిల్' అనే టైటిల్ ని ఖరారు చేసి చిత్రం టీజర్ ని వదిలారు. ఈ టీజర్ చాలా స్టైలిష్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గత చిత్రాలకు పూర్తి భిన్నంగా గోపీచంద్ స్టెలిష్ లుక్‌తో కనిపించబోతన్నట్టు చిత్ర వర్గాల సమాచారం. హీరో గోపీచంద్ కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా వున్నట్లు తెలిసింది. ఇందులో గోపీచంద్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, ఆయన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ హంగులతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

పూర్తి కమర్షియల్ హంగులతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నారు. రన్ రాజా రన్ చిత్రానికి సూపర్ హిట్ సంగీతం అందించిన ఘిబ్రాన్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు.

చిత్రంలో చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.

 Gopichand's 'Jil' teaser

ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: ఘిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

English summary
Here comes the most awaited teaser of action hero Gopichand's upcoming movie. Directed by debutant Radha Krishna Kumar, a protege of director Chandrasekhar Yeleti, the film is titled 'Jil' and stars Gopichand and Rashi Khanna in the leads.
Please Wait while comments are loading...