గోపీచంద్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ ..డిటేల్స్
తెరపై మొగుడుగా కనిపించిన గోపీచంద్ నిజజీవింతోనూ మొగుడు గా మారనున్నారు. గోపీచంద్ వివాహ మూహూర్తం నిశ్చయమైంది. పిబ్రవరి 24న ఈ వివాహం జరగనుంది. తల్లి తండ్రులు కుదిర్చిన వివాహాన్నే గోపీచంద్ చేసుకోనున్నారు. సంప్రదాయబద్దంగా,గ్రాండ్ గా ఈ వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గోపీచంద్ వివాహమాడబోయే అమ్మాయి పేరు హరిత. హైదరాబాద్ కి చెందిన బిజెనెస్ మ్యాన్ కూతురు ఆమె. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివి ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో ఎమ్.బి.ఎ చేస్తోంది. ఈ నెలాఖరున నిశ్చితార్దం జరనుంది.
గోపీచంద్ ఈ మధ్యనే ఈ సంభందంని పెళ్లిచూపులు సంప్రదాయబద్దంగా చూసాడని, ఆమె బాగా నచ్చటంతో ఓకే చేసాడని చెప్తున్నారు. ఇక గోపీచంద్ ప్రస్తుతం సత్యనారాయణ అనే నూతన దర్శకుడు సినిమాని ఓకే చేసారు. పంజా నిర్మాతలు ఆ సినిమాని నిర్మిస్తారు. రీసెంట్ గా అతను కృష్ణ వంశీ దర్శకత్వంలో చేసిన మొగుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రం అనంతరం యేలేటి చంద్రశేఖర్ దర్సకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్కడున్నాడు చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











