Just In
- 15 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 42 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 2 hrs ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
Don't Miss!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హిట్ కోసమే ‘సాహసం' (ప్రివ్యూ)
హైదరాబాద్ : ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం చిత్రాలు యేలేటి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఆ చిత్రాలతో ఆయనకు తనకంటూ అభిమానులను తయారు చేసుకున్నారు. అలాగే గోపీచంద్ కు మాస్ లోమంచి ఇమేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎప్పుడూ ఆసక్తే. తాజాగా ఆయన గోపీచంద్ హీరోగా 'సాహసం' చిత్రాన్ని రూపొందించి ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
గౌతమ్ వర్మ (గోపీచంద్) ఓ సెక్యురిటీ గార్డ్. జీతం తక్కువ. కానీ ఖరీదైన కలలు కంటుంటాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని ఆశ. లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు ఓ చోట నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఆ చోటుకి చేరుకోవడం తేలికైన విషయం కాదు. అందుకోసం గౌతమ్ ఎన్ని సాహసాలు చేశాడనేదే ఈ చిత్ర కథ. మరోవైపు శ్రీనిధి (తాప్సి)కి దైవభక్తి ఎక్కువ. ఈ ప్రపంచం అంతమైపోతుందని నమ్ముతూ, ఈలోగా జీవితాన్ని ఆనందంగా గడిపేయాలి అనుకొంటుంది. విరుద్ధ భావాలు కలిగిన వీరిద్దరూ ఎలా ప్రయాణం సాగించారు అనేది ఆసక్తిరం.
దర్శకుడు మాట్లాడుతూ ''నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇప్పటి వరకూ ప్రయోగాత్మక చిత్రాలు చేశా. తొలిసారి కథానాయకుడి ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన కథ. వాణిజ్య అంశాలన్నీ ఉంటాయి. సినిమా ఓ ఫజిల్‌లాగా అనిపిస్తుంది. తరవాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. లడక్‌లో తీసిన యాక్షన్ సన్నివేశాలు తప్పకుండా ఆకట్టుకొంటాయి. పతాక సన్నివేశాల్లో నలభై నిమిషాల పాటు సాగే విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణ''అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ- ''ఒక చిన్న పిల్లకాలువలా ఈ కథ మొదలవుతుంది. పోను పోను మహాసముద్రంగా మారుతుంది. ఊహకందని రీతిలో కథ, కథనాలు సాగుతాయి. ఓ సెక్యూరిటీ గార్డ్ జీవితంలోని ఆసక్తికరమైన మలుపులే ఈ సినిమా. నిధి నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీ ఇది. చంద్రశేఖర్ ఏలేటి ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చంద్రశేఖర్ శైలిలో ఈ సినిమా ఉంటుంది. శ్రీ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. శ్రీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గోపిచంద్‌కి కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్నిస్తుంది'' అని నమ్మకం వ్యక్తం చేశారు.
సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.
నటీనటులు: గోపీచంద్, తాప్సి, శక్తికపూర్, అలీ తదితరులు.
సంగీతం: శ్రీ
మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్,
కెమెరా: శ్యామ్‌దత్ ఎస్.,
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
కళ: ఎస్.రామకృష్ణ,
పాటలు: అనంత శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్,
సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు,
సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్ మెంట్స్.
నిర్మాత: బీవీఎస్‌ఎన్ ప్రసాద్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
విడుదల: 12,జూలై 2013 (శుక్రవారం).