»   » సంపత్ నందీ..,, గోపీ చందూ.., ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా

సంపత్ నందీ..,, గోపీ చందూ.., ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌ లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్నాడు గోపీచంద్. య‌జ్ఞం, ఆంధ్రుడు, ల‌క్ష్యం, శౌర్యం, శంఖం, గోలీమార్ జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు ఆక్సిజ‌న్ అనే మరో డిఫ‌రెంట్ యాక్ష‌న్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది.

ఏమైంది ఈవేళ అనే యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్‌తో స‌క్సెస్ కొట్టి త‌ర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌తో ర‌చ్చ అనే సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డ‌మే కాకుండా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను బెంగాల్ టైగ‌ర్ అంటూ స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేసిన స్టార్ డైరెక్టర్ సంప‌త్ నంది.

Gopichand, Sampat Nandi Team For a Massive Entertainer

ఈ మూడు చిత్రాలను మూడు డిఫరెంట్ ఫార్మేట్స్ లో నిర్మించి హ్యాట్రిక్ సాధించిన దర్శకుడి తో శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.పుల్లారావు౼జె.భగవాన్ నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు జె.పుల్లారావు౼జె.భగవాన్ లు మాట్లాడుతూ.. గోపీచంద్ లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత్త‌గా ప్ర‌జెంట్ చేసే చిత్ర‌మిది. ఇది వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాల కంటే హై బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ అంశాలతో ఈ సినిమాను ప్రెస్టిజియ‌స్ గా రూపొందిస్తాం. సంప‌త్ నంది సూప‌ర్బ్ క‌థ చెప్పారు. కథలో భాగంగా చిత్రీకరణ విదేశాల్లో జరుపుతాం. ఈ క‌థ‌కు గోపీచంద్‌ అయితే స‌రిపోతార‌ని ఆయ‌న్ను అడ‌గ‌టం, ఆయ‌న స‌రేన‌న‌డం జ‌రిగింది. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. గోపీచంద్‌లో మ‌రో స‌రికొత్త మాస్ యాంగిల్‌ను ఈ చిత్రంలో చూస్తారు. కొంత మంది టెక్నిషియ‌న్స్ ఫైన‌లైజ్ అయ్యారు. త్వరలోనే మిగిలిన టెక్నీషియన్స్ పేర్లు కూడా తెలియజెస్తాం అన్నారు.

Gopichand, Sampat Nandi Team For a Massive Entertainer

గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్ః బెజ‌వాడ కోటేశ్వ‌ర‌రావు, ఎడిట‌ర్ః గౌతంరాజు, సినిమాటోగ్ర‌ఫీః ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్‌, ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: రామ్౼లక్ష్మణ్, స్క్రిప్ట్ కో ఆర్టినేటర్: సుధాకర్ పావులూరి, నిర్మాతలుః జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సంప‌త్ నంది.

English summary
Action Hero Gopichand and Mass Director Sampat Nandi. two are soon to come up with a new movie to be produced by J Bhagawan, J Pulla Rao.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu