twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ - సంప‌త్ నంది మూవీ అప్డేట్స్

    By Bojja Kumar
    |

    మాస్ యాక్ష‌న్ హీరో గోపీచంద్‌, హ్యాట్రిక్ హిట్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా సినిమా బ్యాంకాక్‌లో జ‌రిగిన భారీ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

    ఈ షెడ్యూల్‌లో 70 మంది న‌టీన‌టులు పాల్గొనగా 30 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. అద్భుత‌మైన బ్యాంకాక్ లోకేష‌న్స్‌లో సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేసారు.

    మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ అనుకున్న ప్లానింగ్‌లో చ‌క్క‌గా పూర్త‌య్యింది. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, సినిమాటోగ్రాఫ‌ర్ సౌంద‌ర్ రాజ‌న్ తెర‌కెక్కించిన విజువ‌ల్స్ చాలా గ్రాండియ‌ర్‌గా వ‌చ్చాయి. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో చిత్రీక‌రించిన ప్రీ క్లైమాక్స్ సీన్స్‌, బ్యాంకాక్ బ్రిడ్జిపై హెలికాప్ట‌ర్‌తో చిత్రీక‌రించిన‌ భారీ కార్ చేజింగ్ సీన్ అద్భుతంగా వ‌చ్చాయి.

    Gopichand-Sampath Nandi New Movie First Schedule Completed

    అలాగే రిచ్‌నెస్ కోసం సినిమాను బ్యాంకాక్‌లోని ప్ర‌ముఖ బార్స్‌, ప‌బ్స్‌లో చిత్రీక‌రించాం. ఫ్యామిలీ స‌న్నివేశాలు, క్యాథ‌రిన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సన్నివేశం, విల‌న్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను, త‌నికెళ్ళ భ‌ర‌ణి సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌తారు. ఎంజాయ్ చేసేలా ప్ర‌తి సన్నివేశాన్ని రిచ్ లుక్‌తో రూపొందిస్తున్నాం అన్నారు.

    ముఖేష్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.

    English summary
    Mass action hero Gopichand, Hat trick hit director Sampath Nandi and prestigious banner Sri Balaji Cine Media combination new movie wrapped up a large first schedule in Bangkok. This grueling schedule lasted for 30 days with nearly 70 members from casting, technical crew took part. Sampath Nandi shot crucial episodes of the film in unseen and untapped Bangkok locations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X