»   »  గోపీ చంద్ 'శౌర్యం' ఈ రోజే

గోపీ చంద్ 'శౌర్యం' ఈ రోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Souryam
గోపిచంద్, అనుష్క జంటగా సినిమాటోగ్రాఫర్ శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం "శౌర్యం". ఈ రోజు (గురువారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబయ్యింది. కధ ప్రకారం ''విజయ్‌ (గోపీచంద్‌) తన చిన్నప్పటి లక్ష్యం కోసం కఠోరంగా శ్రమిస్తుంటాడు. అందులో భాగంగానే కోల్‌కతాకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ శ్వేత (అనుష్క), దివ్య (పూనమ్‌కౌర్‌) పరిచయమవుతారు. అతనికి లక్ష్యసాధనలో ఎదురైన అడ్డంకులేమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరం'' అని దర్శకుడు పేర్కొన్నారు.

అలాగే గోపిచంద్, అనుష్కలపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొంటాయని చెప్పారు. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఇక భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన మాట్లాడుతూ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన చిత్రంగా ఇది ఉంటుంది. అలాగే మా సినిమా పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. గోపీచంద్‌ సినిమాల్లో ఉండే యాక్షన్‌ సన్నివేశాలతోపాటు చక్కటి వినోదం, లవ్లీ రొమాన్స్‌ కూడా మా చిత్రంలో ఉంటాయి. స్విట్జర్లాండ్‌ లొకేషన్లు కూడా కనువిందు చేస్తాయని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X