»   » పూరీ జగన్నాధ్ కి నచ్చిన కథతోనే...గోపీచంద్

పూరీ జగన్నాధ్ కి నచ్చిన కథతోనే...గోపీచంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోలీమార్ చేస్తున్న సమయంలో...నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని పూరీజగన్నాథ్ అడిగారు. మంచి కథ కోసం చూస్తున్నానని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత పూరీ నుంచి ఫోన్ వచ్చింది. నీ దగ్గరకు ఓ వ్యక్తిని పంపుతున్నాను. అతని దగ్గర మంచి కథ ఉంది. నేను విన్నాను. చాలా బాగుంది. ఓ సారి విను అని చెప్పారు పూరీ. కట్‌చేస్తే... రవి నా దగ్గరకు వచ్చాడు. ఈ కథ చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. వెంటనే పూరీకి థ్యాంక్స్ చెప్పాను. అనుకున్న దాని కంటే చక్కగా సినిమాను తీశాడు. ఈ సినిమాను కొనుక్కున్న వారందరూ హ్యాపీగా ఫీలవుతారని నా నమ్మకం అన్నారు గోపీచంద్.ఆయన తాజా చిత్రం వాంటెడ్ ఆడియో రీసెంట్ గా విడుదల అయ్యింది.ఈ సందర్బంగా గోపీచంద్ ఇలా మాట్లాడారు.

అలాగే గోపీచంద్ ఇలాగే ఓ పదిమంది ద ర్శకులను పరిశ్రమకు పరిచయం చేయాలనీ, రవి తప్పకుండా సక్సెస్ సాధించాలని పూరీ జగన్నాథ్ మాట్లాడారు. దర్శకుడు రవి మాట్లాడుతూ మొన్నటిదాకా రైటర్ ‌ని. ఇప్పుడు దర్శకుడ్ని అయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్‌గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్నారు. ఆడియో సీడీని ప్రభాస్ ఆవిష్కరించి శాసనసభ్యురాలు, నటి జయసుధకు అందించారు. ఇంకా శ్రీను వైట్ల, రానా, దీక్షాసేథ్, పోకూరి బాబూరావు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.బ్రహ్మానందం, చంద్రసిద్దార్థ్, భగవాన్, రసూల్ ఎల్లోర్, భాస్కరభట్ల, ఎడిటర్ శంకర్, స్మిత, కల్పన తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu