»   » గోపీచంద్ 'వాంటెడ్' చిత్రం ఫైనల్ రిజల్టు ఏమిటి

గోపీచంద్ 'వాంటెడ్' చిత్రం ఫైనల్ రిజల్టు ఏమిటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్, దీక్షాసేధ్ కాంబినేషన్ లో రూపొంది రిలీజైన వాంటెడ్ చిత్రం మొదటి రోజు మార్నింగ్ షో కే ఇనానమస్ గా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. టాక్ స్ప్రెడ్ అయ్యి రెండో రోజుకే చాలా చోట్ల కలెక్షన్స్ పూర్తి స్ధాయిలో డ్రాప్ అయ్యాయి. ఇక ఈ చిత్రం ద్వారా బి.వి.యస్ రవి అనే రచయిత దర్శకుడు మారారు. అయితే ఈ చిత్రంలో అతను రచయితగానూ పూర్తిగా ఫెయిలయ్యాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఎనభైల నాటి రివెంజ్ ఫార్మెట్ తో కూడిన కథే మైనస్ గా మారిందని, అలాగే దర్శకుడుగా రవి కొత్తగా ప్రెజెంట్ చేసిందేమీ లేదని చెప్తున్నారు. కమర్షియల్ చిత్రం పేరుతో బాగా ముతక కథని ఎన్నుకుని, దాన్ని అంతకన్నా ముతకగా తెరపై చెప్పే ప్రయత్నం చేసాడాని, చాలా చోట్ల కథలో లింకులు కూడా కలవలేదని విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. కథలో హీరోయిన్ తనను ప్రేమిస్తున్నానంటూ వెంటబడే హీరో ని రెచ్చగొట్టి అతని చేత విలన్ గ్యాంగ్ ని హత్యలు చేయిస్తూంటుంది. ప్రేమకోసం అతను ఓ ప్రొపెషనల్ కిల్లర్ లా పాశవికంగా హత్యలు చేస్తూ పోతూంటాడు.చట్టం..పోలీసులు ఈ విషయాలు అన్నీ ప్రక్కన పెడితే అయితే ఆమెకు అస్సలు ఈ హత్యలు అర్జెంటుగా చేయంచాలన్న ఆలోచన ఎందుకు కలిగిందనేదే ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది. అదీ మ్యాటర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu