twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బి.గోపాల్‌ దర్శకత్వంలో యంగ్ యాక్షన్ హీరో

    By Srikanya
    |

    హైదరాబాద్ : సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు,ఇంద్ర వంటి మెగా హిట్ చిత్రాలు రూపొందించిన బి.గోపాల్ చిత్రాలు అంటే ప్రేక్షకులలో ఆసక్తే. ఆయన రామ్ తో చేసిన మస్కా తర్వాత ఏ చిత్రమూ చేయలేదు. తాజాగా మరో చిత్రం కమిటయినట్లు సమాచారం. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేయటానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

    ప్రస్తుతం గోపీచంద్‌ ప్రస్తుతం 'జాక్‌పాట్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరవాత నటించే చిత్రానికి బి.గోపాల్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

    నిజానికి 2010లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే మస్కా రైటర్ చెప్పిన కథని బి.గోపాల్ ఓకే చేసి గోపీచంద్ తో సినిమా అనుకునన్నారు. అప్పట్లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ తెరకెక్కుతుందని తెలుస్తోంది.

    తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు.

    మరో ప్రక్క గోపీచంద్‌, తాప్సీ జంటగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొత్తానికి పూర్తైంది. రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేసారు. దాంతో టాకీ ఆల్ మోస్ట్ ఫినిష్ అయినట్లు చెప్తున్నారు.

    English summary
    Very soon Gopichand might work in another film that will be directed by senior director B Gopal. Bhavya Creations will produce this film. More details are awaited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X