»   »  ఘనంగా గోపిక ఎంగేజ్ మెంట్

ఘనంగా గోపిక ఎంగేజ్ మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gopika
నా ఆటోగ్రాఫ్ సినిమాతో పరిచయమైన మళయాళీ భామ గోపిక. ఆమె Dr Ajilaesh ని త్వరలో వివాహం చేసుకోబోతోందన్న సంగతి తెలిసిందే. ఎంగేజ్ మెంట్ నిన్న ఉదయం త్రిసూర లో గల Joyce Palace దగ్గర బంధువుల సమక్షంలో జరిగింది. ఓ ప్రక్క పిల్లలు తమ చిట్టి చేతులతో పూలు జల్లుతుండగా వీరిద్దరూ లోపలికి వచ్చారు. ఆమె తల్లి తండ్రులు Anto Francis ,Dessy Hunto సమక్షంలో ఒకరినొకరు వజ్రపు ఉంగరాలు మార్చుకున్నారు.

అనంతరం వివాహం ఈ నెల 17న ఎర్నాకులం లోని సెయింట్ ధామస్ చర్చిలో జరుగుతుందని రిసెప్షన్ పార్టీ ఎవెన్యూ సెంటర్ లో 20 వతేదీన జరుగుతుందని ఆనందోత్సాహాల మధ్య ప్రకటించారు. ఇక ఈ పంక్షన్ కి కేరళ స్టేట్ మినిస్టర్స్ రాజేంద్రన్, విశ్వనాధం అటెండయి కాబోయే దంపతులను ఆశ్వీదరించారు. అలాగే గోపిక సినీ ప్రెండ్స్ భావన, బిజూ మీనన్, సమవిత్రా, రమ్య నంబిసన్, సంయుక్త తదితరులు అటెండయి, ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.ఇక పెళ్ళయిన తర్వాత గోపిక ఐర్లాండ్ లో సెటిల్ అవుతాని ప్రకటించింది. వేరే ప్లాన్స్ ప్రస్తుతానికి లేవని తేల్చేసింది.ఆల్ ది బెస్ట్ గోపిక...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X