»   » తెలుగులో ఆ హీరోయినే రెమ్యునేషనే టాప్

తెలుగులో ఆ హీరోయినే రెమ్యునేషనే టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దేవదాసు' చిత్రంతో తెరంగ్రేటం చేసి 'పోకిరి' తో సెటిలైన ఇలియానాకు ఈ మధ్య 'రెచ్చిపో', 'సలీం' అంటూ ప్లాపులు వచ్చాయి. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఇప్పటికీ టాప్ గానే ఉంది. మొన్నటిదాకా కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఈ గోవా భామ ఇప్పుడు కోటిన్నర దాకా అడుగుతోంది. ప్రస్తుతం ఎన్‌.టి.ఆర్‌. 'శక్తి'లోను, రానా 'నేను నా రాక్షసి'లోను హీరోయిన్ గా చేస్తున్న ఈమే ఒప్పుకునే కొత్త చిత్రాలకు మరింత రేటు పెంచాలనే ప్లాన్ లో ఉందిట. అయినా ఆమే కావాలని నిర్మాతలు ఆమె చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. దానికి కారణం ఆమె పూర్తిగా..హీరోల హీరోయిన్ కావటమేనంటున్నారు. హీరోలు ఆమే కావాలని పట్టుబడుతున్నారని..అదే ఆమెకు ప్లస్ అవుతోందని అంటున్నారు. అందుకే ఆమె ఫామ్ ‌లో ఉన్న అనుష్క, త్రిష, నయనతార, ప్రియమణిల కన్నా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయగలుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu