»   » ‘బాహుబలి-2’లో మాధురి దీక్షిత్, ఏ పాత్రో తెలుసా?

‘బాహుబలి-2’లో మాధురి దీక్షిత్, ఏ పాత్రో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా త్వరలో రాబోయే బాహుబలి-2లో ప్రతి సినిమా ఇండస్ట్రీ నుండి ఒక స్టార్ ఈ సినిమాలో ఏదో ఒక పాత్రలో నటిస్తే బావుంటుంది అనే ఒక అభిప్రాయాన్ని అందరిలోనూ కలిగించింది.

ఇప్పటికే రజనీకాంత్, సూర్య, చిరంజీవి, నాగార్జున, సమంతతో పాటు పలువురు స్టార్స్ తాము కూడా ఏదో ఒక చిన్న పాత్ర ద్వారా ఈ సినిమాలోభాగమైతే బావుండు అనే తమ మనసులోని మాటను ఇప్పటికే బయట పెట్టారు. టాలీవుడ్ స్టార్లు మాత్రమే కాదు పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులో భాగం కావాలని కోరుకుంటున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ బాహుబలి-2లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె అనుష్క సిస్టర్ గా, కుంతల రాజ్యం మహారాణిగా కనిపించబోతోందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన వెలువడనుంది.

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ బాహుబలి-2లో బాలీవుడ్ నుండి కొందరిని సినిమాలో తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, అప్పుడే బాలీవుడ్లో కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయని సూచించాడని, అందులో భాగంగానే మాధురి దీక్షిత్ ను గెస్ట్ రోల్ కు రాజమౌళి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్


బాహుబలి-2లో మాధురి దీక్షిత్ ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజమౌళి నుండి ప్రకటన రావాల్సి ఉంది.

విద్యా బాలన్

విద్యా బాలన్


ఒక వేళ మాధురి దీక్షిత్ ఆ పాత్ర చేయడానికి నిరాకరిస్తే... విద్యాబాలన్ ను సంప్రదించే అవకాశం ఉంది.

సూర్య

సూర్య


రాజమౌళి అవకాశం ఇస్తే తాను గెస్ట్ రోల్ చేయడానికి సిద్దమే అని సూర్య ఇప్పటికే ప్రకటించారు.

శ్రీయ

శ్రీయ


సినిమాలో రానా దగ్గుబాటి భార్య పాత్రలో ఒక సీన్లో శ్రీయ కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.

మీ అభిప్రాయం

మీ అభిప్రాయం


ఈ స్టార్స్ బాహుబలి 2 నటిస్తే ఎలా ఉంటుందనే అంశంపై మీ అభిప్రాయం కామెంట్ బాక్సులో వెల్లడించండి.

English summary
According to the sources, Madhuri Dixit is keen on grabbing an opportunity to be a part of the prestigious second installment of Baahubali. If the reports are to be believed, she might play the role of Anushka's sister, a queen of Kunthala dynasty in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu