»   » వావ్..! ఇంకో ప్రయోగం: ఒకసారి నాలుగు భాషల్లో నలుగురు హీరోలతో

వావ్..! ఇంకో ప్రయోగం: ఒకసారి నాలుగు భాషల్లో నలుగురు హీరోలతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతం మీనన్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా అన్న విశయం మనకు తెలిసిందే కదా. ఇటీవల శింబుతో తమిళంలో, చైతూతో తెలుగులో సినిమాను తెరకెక్కించిన గౌతమ్‌ మీనన్ ఇప్పుడు నాలుగు భాషలలో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా స్వీయ నిర్మాణం లోనే అట తెలుగులో సాయి ధరమ్‌ తేజ్‌, మలయాళంలో పృధ్వీరాజ్ , కన్నడ నటుడు పునీత్‌ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలుగా గౌతమ్ మీనన్‌ మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం. తమిళంలో శింబూ లేదా జయం రవి ఉండొచ్చు అనుకుంటున్నారు. ఈ ఇద్దరిలో అసలు హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది.

ఒకే కథను వేర్వేరు భాషల్లో వేర్వేరు హీరోలతో తీయడం గౌతమ్‌ కు అలవాటు. ఘర్షణ.. ఏమాయ చేసావె.. ఎటో వెళ్లిపోయింది మనసు.. లేటెస్టుగా 'సాహసం శ్వాసగా సాగిపో'.. ఇవన్నీ కూడా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ తెరకెక్కాయి. సాయిధరమ్‌ తో చేయబోయేది ఏకంగా నాలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కబోయే సినిమా అట.

tham

ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, తమన్నాలనిఎంచుకొని మూడో హీరోయిన్ కోసం అన్వేషనలో ఉన్నాదత గౌతం. ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని గౌతమ్‌ మీనన్ స్వయంగా తమిళ మీడియాకు తెలియజేశాడు. ఇక ఇప్పటికే అనుష్క, తమన్నా డేట్స్ తీసుకున్న ఈ ప్రముఖ దర్శకుడు మిగతా ఆర్టిస్టులతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సాయి ధరమ్‌ తేజ్ అయితే గౌతమ్‌ మీనన్ సినిమాలో నటించాలని చాలా ఉత్సుకతతో ఉన్నట్టు సమాచారం.

ఈ భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు గౌతమ్ మీనన్ కొద్దికాలం క్రితం రామ్ చరణ్ అల్లుఅర్జున్ లతో చర్చించి నట్లు టాక్. అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ విషయంలో చరణ్ బన్నీలు పెద్దగా ఆసక్తి కనపరచక పోవడంతో ఈ ప్రాజెక్ట్ ను గౌతమ్ మీనన్ కొంతకాలం అటక ఎక్కించి ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకు వస్తున్నాడని తెలుస్తోంది. ఇద్దరు మెగా హీరోలు కాదన్నా ఇంకో మెగా హీరోనే ఈ సినిమా కోసం తీసుకోవతం కొసమెరుపు...

English summary
According to the sources, Famous South Indian director Gautham Vasudev menon is plannig a big multilingual project. For this, he selected Simbu for Tamil Version, Puneeth Rajkumar for Kannada,Pruthviraj for Malayalam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X