»   » రికార్డ్: సీడెడ్‌లో రామ్ చరణ్ సినిమాకు కోట్ల వర్షం!

రికార్డ్: సీడెడ్‌లో రామ్ చరణ్ సినిమాకు కోట్ల వర్షం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం విడుదలకు ముందే బిజినెస్ అదర గొడుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని సీడెడ్ ఏరియాకు చెందిన ఓ బడా డిస్ట్రిబ్యూటర్ కోట్లు ఖర్చు పెట్టి తీసుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం.

ఇంతకు ముందు విడుదలైన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం సైడెడ్ ఏరియాలో దాదాపు రూ. 8 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటి అంచనాల ప్రకారం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రానికి భారీ మొత్తంలో సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Govindudu Andari Vadele fetches record ceded price

గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రం టీజర్ రెడీ అయ్యిందని, అది అద్బుతంగా వచ్చిందని ఇప్పటికే బండ్లగణేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులను ఊరిస్తున్నారు. ఇంతకీ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే... చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary

 According to the latest update, Govindudu Andari Vadele’s ceded distribution rights have been sold for a bomb which run into several crores. This is good news for the team as their product is already much in demand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu