twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాపుకి అంకితమిస్తున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు. ఆయనంటే కృష్ణవంశీ కు గురు భక్తి. అందుకే ..'గోవిందుడు అందరివాడేలే' చిత్ర బృందం బాపును స్మరించుకొంటోంది. రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటించిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. వచ్చే నెల 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రాన్ని బాపుగారికి అంకితమిస్తున్నారు.

    ఈ విషయం గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ ''అంకితం అంటే పెద్ద మాట అవుతుందేమో? ఆయనకు అంకితం చేయగల గొప్పవాళ్లం కాదు. 'తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముంగిట 'ముత్యాల ముగ్గు'వేసిన పద్మశ్రీ బాపుగారికి వినమ్రతతో మీ ఏలకవ్య శిష్యబృందం'' అంటూ సినిమా ప్రారంభంలోనే టైటిల్‌ కార్డ్‌ వేస్తున్నాం. అలా బాపును గుర్తుచేసుకొంటున్నాము''అన్నారు.

    'గోవిందుడు..' కృష్ణవంశీ కెరీర్‌ని మళ్లీ హైవే ఎక్కిస్తుందని యూనిట్ అంతా నమ్మకంగా చెబుతోంది. ప్రచార చిత్రాలు చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తోంది. ఆ కష్టం ఫలించి.. 'గోవిందుడు..' కాసుల వర్షం కురిపిస్తే అంతకంటే కావల్సిందేముంది? అంటున్నారు. అక్టోబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

    Govindudu Andarivadele Movie Goes to Bapu

    లండన్‌లో పుట్టి పెరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అలవాటు పడిన అభిరామ్ అనే యువకుడు తన మూలాల్ని వెతుక్కుంటూ ఓ అందమైన తెలుగు పల్లెకు వస్తాడు. అక్కడ అతను సరికొత్త జీవితాన్ని దర్శిస్తాడు. పల్లె అప్యాయతలు, అనుబంధాలకు ముగ్ధుడవుతాడు. అభిరామ్ అందరివాడనిపించుకుంటాడు. ఈ క్రమంలో జరిగే భావోద్వేగభరిత సంఘటనల సమాహారమే గోవిందుడు అందరివాడేలే చిత్ర ఇతివృత్తం అన్నారు కృష్ణవంశీ.

    ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ కుటుంబ బంధాలకు దర్పణంలా ఈ సినిమా వుంటుంది. రామ్‌చరణ్ పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి. మా బ్యానర్‌కు మరింత గుర్తింపునిచ్చే చిత్రమవుతుంది అన్నారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    Ram Charan's Govindudu Andarivadele makers and unit decided to dedicate the film to Bapu to show their respect and on this context a picture of the him has been added to title cards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X