twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గోవిందుడికి....’ సెన్సార్ బోర్డ్ షాక్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫిరెట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని నిర్మాతలను సెన్సార్ బోర్డ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే విధంగా సెంటర్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ సంస్థ వారు ఈ చిత్రంలో కాజల్‌పై చిత్రీకరించిన కొన్ని ఎక్స్ ఫోజింగ్ సీన్లు తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం.

    Govindudu Andarivadele need ‘No Objection Certificate’

    సినిమా విశేషాల్లోకి వెళితే...‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీనీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    ఈ చిత్రాన్ని నైజాం, కృష్ణ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించకుండా నిర్మాత బండ్ల గణేష్ సొంతగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగు సినిమాలకు కలెక్షన్ల పరంగా నెం.1 స్థానంలో ఉండే నైజాం ఏరియాలో నిర్మాతే సొంతగా రిలీజ్ చేసుకుంటుండటం చర్చనీయాంశం అయింది.

    English summary
    Govindudu Andarivadele movie is based in a village, various animals have been showcased and this reason, censor board has asked them to get a ‘No Objection Certificate’ (NOC) from Animal Welfare Board of India (AWBI).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X