»   » హీరోయిన్ కాజోల్‌కు అరుదైన అవకాశం!

హీరోయిన్ కాజోల్‌కు అరుదైన అవకాశం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌ ప్రసార భారతి పార్ట్ టైమ్ మెంబర్‌గా నియమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్‌కు కొత్త లుక్ తెచ్చే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా పలు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దూరదర్శన్‌కు మరింత ప్రచారం కల్పించడంలో భాగంగా పలువురు ప్రముఖులను తాత్కాలిక బోర్డు మెంబర్లుగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సినిమా రంగం నుండి ఇందు కోసం కాజల్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కాజోల్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ కు జోడీగా ‘దిల్ వాలే' సినిమాలో నటిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్లో షారుక్-కాజోల్ జోడీ అంటే చాలా ఫేమస్. బాలీవుడ్ ఐకానిక్ ఫిల్మ్స్ బాజిగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై లాంటి ఆల్ టైం హిట్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ ‘మై నేమ్ ఈజ్ ఖాన్' అనే చిత్రంలోనూ జోడీ కట్టారు.

Govt considers Kajol as Prasar Bharti board member

తాజాగా మరోసారి కాజోల్ వెండితెరపై షారుక్ కు జోడీగా కనిపించబోతోంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కాజోల్ బాలీవుడ్ తాజా మూవీ ‘దిల్ వాలే' చిత్రంలో నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె షారుక్ కు జోడీగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ఈ ఫోటో షేర్ చేయడంతో పాటు డిసెంబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను కాజోల్ కు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫాంలో ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కత్రినా, కరీనా, ప్రియాంక చోప్రా లాంటి వాళ్లకు మాత్రమే ఈ రేంజిలో పారితోషికం ఉంది. అసలు ఫాంలో లేని, వయసు పైబడిన కాజోల్ కు ఈ రేంజిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం చర్చనీయాంశం అయింది.

Govt considers Kajol as Prasar Bharti board member

కాజోల్ కు ఉన్న ఇమేజ్, టాలెంట్ తో పోలిస్తే ఇంత మొత్తంలో పారితోషికం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదని పలువురు అంటున్నారు. మరో వైపు షారుక్-కాజోల్ జోడీ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, సినిమాపై క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఆమెకు ఇంత మొత్తంలో పారితోషికం ఆఫర్ చేసారని అంటున్నారు. ఈ చిత్రంలో షారుక్-కాజోల్‌తో పాటు వరుణ్ ధావన్ - కృతి సనన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి-గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్ మస్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని రోహిత్ శెట్టి చెబుతున్నారు.

English summary
The ET report quoted a government as saying, “ The government is looking at changing the look and feel of Doordarshan completely in the next few months and it is important we have someone accomplished and from the mainstream entertainment industry to revamp the content in Doordarshan. Hence Kajol was considered."
Please Wait while comments are loading...