»   » కమల్ తో సహజీవనం గురించి గౌతమి (ఫోటో పీచర్)

కమల్ తో సహజీవనం గురించి గౌతమి (ఫోటో పీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మనిద్దరం ఒకరికొకరం ఏమవుతాం... ఈ ప్రశ్న కమల్‌, నేనూ చాలాసార్లు వేసుకున్నాం. కానీ మా బంధానికి పేరు పెట్టుకోదలచుకు కోలేదు. 'స్నేహితులూ, ప్రేమికులూ, భార్యాభర్తలూ... ఇలా ఎన్నో బంధాలకు పేర్లున్నాయి. కానీ కమల్‌హాసన్‌తో నా బంధానికి పేరు లేదు. మేం పెట్టదలచుకోలేదు కూడా.

మె పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. తాజాగా ఓ తెలుగు దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన లైఫ్ లో ఫేస్ చేసిన సమస్యల్ని, అలాగే సినిమా చాన్స్ కూడా అనుకోకుండా వచ్చిందని కానీ మొదటి సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవవసరం లేకపోయిందని చెప్పింది. తన మొదటి భర్త నుంచి దూరంగా ఉన్న గౌతమి తన కూతిరుతో ఉంటోంది. అలాగే ఆమె ప్రస్తుతం కమల్ హాసన్ తో సహజీవనం సాగిస్తోంది.

గౌతమికి 2005లో రొమ్ము కాన్సర్ వచ్చింది. సుమారు ఆరేళ్ళ పాటు నిర్విరామంగా తీసుకున్న చికిత్స వల్ల ఆమె కాన్సర్ ని జయించగలిగింది. సినిమాలకు దూరంగా ఉన్న గౌతమి ప్రస్తుతం 'రంగం' అనే టీవీ ప్రోగ్రాంలో కనిపిస్తోంది. టీవీలో వచ్చే 'రంగం' కార్యక్రమం కోసం కొంత టైం కేటాయించినా మిగిలిన సమయమంతా పాపతో గడపడానికే వెచ్చిస్తా. తను బాగా చదువుతుంది. ఇప్పుడు నా లక్ష్యం తన భవిష్యత్తును తీర్చిదిద్దడమే అన్నారు.

గౌతమి చెప్పిన మిగతా విశేషాలు...స్లైడ్ షోలో..

కమల్ గ్రేట్..

కమల్ గ్రేట్..

నన్ను గుర్తించి, గౌరవించే వ్యక్తిత్వం కమల్‌ది. మేం ఇంట్లో ఉంటే రాజకీయాలూ, ఇతర సమస్యల గురించి మాట్లాడుకోం. ప్రశాంతంగా పచ్చికలో కూర్చుని గడిపేస్తాం. ఒక్కోసారి ఆయనని చూస్తే చాలా అసూయగా ఉంటుంది... అంత ఎంత అందంగా, ఆకర్షణీయంగా ఉంటారో కదా అని అంటూ చెప్పుకొచ్చారు గౌతమి.

తొలిసారి కమల్ ని..

తొలిసారి కమల్ ని..

కమల్ ని తొలిసారి కలిసిన విషయం గుర్తు చేసుకుంటూ..... కమల్‌జీని మొదటిసారి కలిసింది 'అపూర్వ సహోదరులు' సెట్‌లో. అప్పట్లో ఆయన చాలా సీనియర్‌ నటుడు. సర్‌ అంటూ పిలిచేదాన్ని. ఆ పిలుపే ఇప్పటికీ అలవాటైపోయింది. నా సినిమా జీవితంలో మరిచిపోలేని ప్రశంస అంటే కమల్‌హాసన్‌దే. 'క్షత్రియపుత్రుడు'లో నాది గ్లామర్‌ గర్ల్‌ పాత్ర. అందులో ఒక సన్నివేశంలో నా నటన చూసి కమల్‌ చాలా మెచ్చుకున్నారు. సెట్‌లో ఉన్నవాళ్లతో 'కొత్తలో ఈ అమ్మాయిని చూసి ఏం నటిస్తుందిలే అనుకున్నా. చాలా బాగా చేసింది' అని అన్నారు.

అప్పుడే నిర్ణయించుకున్నా...

అప్పుడే నిర్ణయించుకున్నా...

ఇద్దరం కలిసి నాలుగు సినిమాలలో నటించాం. అప్పటికి మా మధ్య అంత స్నేహం లేదు. సినిమాలు పూర్తయ్యాక కనీసం టచ్‌లో కూడా లేము అన్నారు. అలాగే తిరిగి మేం కలిసింది 2004లో ఓ సినిమా ప్రమోషన్‌లో. అప్పటికి కమల్‌జీ కూడా వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉన్నారు. అనుకోకుండా కలిశాం. తన మాటలూ, వ్యక్తిత్వం నాకు బాగా నచ్చాయి. కొన్ని రోజులకే ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం.

పిల్లలు అర్దం చేసుకుంటారనే..

పిల్లలు అర్దం చేసుకుంటారనే..

శ్రుతి, అక్షర... ఇద్దరూ అప్పటికి కొంచెం పెద్ద వాళ్లే కనుక మమ్మల్ని అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారు. వాళ్లు కూడా నాతో చాలా స్నేహంగా ఉంటారు. కష్టనష్టాలన్నీ పంచుకుంటారు. నా పాప సుబ్బులక్ష్మి కూడా చిన్నప్పట్నుంచి మమ్మల్ని చూస్తూ పెరిగింది కనుక, త్వరగానే అర్థం చేసుకుంది. నేను కోరుకున్న ఆనందకరమైన జీవితం మళ్లీ నాకు దక్కింది అని చెప్పారు

తన వైవాహిక జీవితం గురించి చెప్తూ.....

తన వైవాహిక జీవితం గురించి చెప్తూ.....

సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసేసుకున్నా. పెళ్లయ్యాక ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యా. ఏడాదిలోనే పాప సుబ్బులక్ష్మి పుట్టింది. ఏం బంధం నిలబడటానికైనా ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. అవి లేని చోట ఏ బంధమూ నిలబడదు. నా వైవాహిక జీవితంలోనూ ప్రేమానురాగాలు లోపించాయి. అందుకే చంటిపిల్లతో ఒంటరి జీవితం మొదలుపెట్టా. అప్పుడు నా ఆలోచనంతా పాపకి మంచి జీవితం ఇవ్వడమే అన్నారు.

కమల్‌ ఇచ్చిన స్త్థెర్యంతో...

కమల్‌ ఇచ్చిన స్త్థెర్యంతో...

జీవితమంటేనే ఎత్తు పల్లాలు. ఈ విషయం నాకు ఇప్పటికే అర్థమైంది. అంతా ఆనందంగా ఉన్న సమయంలో 2005 జనవరిలో ఎందుకో రొమ్ములో ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు కమల్‌జీ 'ముంబయి ఎక్స్‌ప్రెస్‌' షూటింగ్‌కు బయల్దేరుతున్నారు. ఓసారి చెకప్‌ చేయించుకోవాలని చెప్పా. వూహించినట్టే రొమ్ము క్యాన్సర్‌ అని తేలింది. సుమారు ఆరేళ్లు కీమోథెరపీ చేయించుకున్నా. 35 సార్లు రేడియేషన్‌ థెరపీ చేయించుకున్నా. ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి కమల్‌జీ నా పక్కనే ఉండి చాలా ధైర్యం చెప్పారు.

పాప భయపడింది.

పాప భయపడింది.

నేనున్న గదిలో మూడు కెమెరాలు పెట్టించాం. మేము మాట్లాడుకున్న సంగతులనీ, మా భావోద్వేగాల్నీ అవి చిత్రీకరించాయి. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా చేయించుకున్న కీమోథెరపీతో నా జుట్టు రాలిపోయింది. చాలా నీరసంగా అయిపోయా. కొత్తలో పాప బెడ్‌పై నన్నలా చూసి చాలా భయపడిపోయింది. కమల్‌, నేనూ కలిసి నా చికిత్స గురించి అర్థమయ్యేట్టు చెప్పాం. అప్పుడు కుదుటపడింది. ప్రస్తుతం పాప హైస్కూల్‌లో చదువుకుంటోంది.

పాప భవిష్యత్తు...

పాప భవిష్యత్తు...

పాప భవిష్యత్తులో ఏమవ్వాలన్నది తన ఇష్టానికే వదిలేశా. తను పెద్దయ్యే వరకూ నా సినిమాలు చూపించలేదు. ఇప్పుడు కూడా నా సినిమాలు రెండో, మూడో చూసింది. నేను సినిమా నటినని పాపకు తెలియడం నాకు ఇష్టం లేదు. మంచి తల్లిగానే ఉండాలనుకుంటున్నా. టీవీలో వచ్చే 'రంగం' కార్యక్రమం కోసం కొంత టైం కేటాయించినా మిగిలిన సమయమంతా పాపతో గడపడానికే వెచ్చిస్తా. తను బాగా చదువుతుంది. ఇప్పుడు నా లక్ష్యం తన భవిష్యత్తును తీర్చిదిద్దడమే అన్నారు.

తొలి ఛాన్స్

తొలి ఛాన్స్

ఇంజినీరింగ్‌ సీటు కోసం నాన్నతో కలిసి హైదరాబాద్‌ వెళ్లా. అక్కడ మాకు తెలిసిన వ్యక్తి నన్ను చూసి ఓ సినిమాలో నటించమని అడిగారు. అది చాలా చిన్న పాత్ర. అడిగింది బంధువే కాబట్టి చేసేసి వచ్చా. ఆ చిన్నపాత్రే నన్ను పెద్ద హీరోయిన్‌ని చేస్తుందని అప్పుడనుకోలేదు. రెండు గంటలే నిద్ర విశాఖపట్నంలోని గీతమ్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌కి చేరా. తరగతులకు వెళుతూ, చదువుకుంటున్న సమయంలో రెండో సినిమా అవకాశం వచ్చింది. సినిమాలను కెరీర్‌గా ఎప్పుడూ ఎంచుకోవాలనిపించలేదు. ఏం చేయాలా అని అమ్మానాన్నలతో చర్చించా. అమ్మ ఒకే విషయం చెప్పింది 'నీకు చదువులో మెరిట్‌ సీట్‌ వచ్చింది... అది అందరికీ రాదు. సినిమా హీరోయిన్‌ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ మందికే వస్తుంది. రెండూ గొప్పవే. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్‌. నీ నిర్ణయం ఏదయినా మాకు ఇష్టమే' అని చెప్పింది.

అదే లోకంగా..

అదే లోకంగా..

రాజేంద్రప్రసాద్‌ హీరోగా మొదటి సినిమా చేశా. ఇందుకోసం చెన్నై వెళ్లా. ఆ సినిమా విడుదల కాకముందే వెంకటేష్‌తో నటించే అవకాశం వచ్చింది. ఇంకేముంది... చెన్నైని వదలలేదు. అమ్మానాన్నలిద్దరూ ప్రాక్టీసును వదిలి, ఆస్పత్రిని మూసేసి, నాకు తోడుగా ఉండేందుకు అక్కడికొచ్చేశారు. తెలుగే కాదు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. వాటిల్లో నటించడమే కాకుండా ఆ భాషలన్నీ ఆసక్తిగా నేర్చుకున్నా. మాట్లాడగలనూ, రాయగలను కూడా. తమిళంలో అయితే టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నా. రజనీకాంత్‌తోనే నాలుగు సినిమాలు వరుసగా చేశా. ఒకానొక సమయంలో ఎంత బిజీ అయిపోయానంటే నిద్రపోవడానికి కూడా సమయం దొరికేది కాదు. కొన్నిసార్లు రోజుకి రెండు గంటలే పడుకునే దాన్ని. అలా ఎనిమిదేళ్లు సినిమాలే లోకంగా గడిచిపోయాయి.

నో ప్లాబ్లం ...శృతి

నో ప్లాబ్లం ...శృతి

మా నాన్నకి, గౌతమికి మధ్య ఉన్న బంధం పై నాకేమీ అబ్జెక్షన్ లేదు. అలాగే మేము మా జీవితాల్లోకి గౌతమి రావటాన్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మా నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అంది శృతి హాసన్ చెన్నై లోని మీడియాతో గౌతమి గురించి మాట్లాడుతూ. అలాగే మా నాన్న నాకు రోల్ మోడల్. నేను చిన్నప్పటినుంచీ ఆయన నటన చూస్తూనే పెరిగాను. ఆయన నటన అనేది నేర్చుకుంటే వచ్చేది కాదని, మనలోనే ఉంటుందని చెప్తూంటారు అంది.

అవకాశాలు..

అవకాశాలు..

తన అందచందాలతోనే కాక నటనతోనూ రాణించిన గౌతమి ఈ మధ్య కాలంలో వెండితెరకు పూర్తి స్ధాయిలో దూరమైంది. అయితే తాను నటించటానికి రెడీగా ఉన్నా పరిశ్రమనుంచి ఆఫర్స్ రావటం లేదని ఆమె వాపోతోంది. ఆమెకు ఏ తరహా పాత్ర ఇవ్వాలో డిసైడ్ అయితే అంత మంచి నటితో చేయించుకోవటానికి అభ్యంతరం లేదని కొందరంటున్నారు. అయితే ఆమె ప్రస్తుతం ఓ టీవీ సీరియల్ ఒప్పుకుంది. అక్కడ కూడా ఫుల్ టైమ్ నటిగా కొనసాగనున్నానని చెప్తోంది. వారి కాంబినేషన్లో క్షత్రియపుత్రుడు వంటి అధ్బుతమైన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Speaking about Kamal Gouthami was reported saying “Several relationships like Friends, Lovers, Wife and Husband exist in our society, but I can’t name my relationship with Kamal Hassan. We have mutual respect for each other.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu