»   »  బాలయ్య బర్త్ డే కి భారీ సన్నాహాలు

బాలయ్య బర్త్ డే కి భారీ సన్నాహాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
నిన్న(బుధవారం) మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కాగా ఇప్పుడు ఆయన కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పుట్టినరోజును ఘనంగా నిర్వహించడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు (జూన్ 10న) బాలకృష్ణ అమెరికాలో ఉంటారు. తను ద్విపాత్రలో చేసిన చిత్రం 'పాండురంగడు' ను అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఏ రీతిన ఆదరిస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. వారిని కలుసుకుంటారు. అందుకని ఆయన పుట్టినరోజును వైభవంగా జరపడానికి అమెరికాలోని ఆయన అభిమానులు ఇప్పట్నించే సన్నాహాలు మొదలుపెట్టారు. ఆరోజు వారు బాలకృష్ణ మీద ఒక ప్రత్యేక సంచికను సైతం వెలువరించనున్నారు. పలు కార్యక్రమాల్ని చేపట్టనున్నారు. మరోవైపు బాలకృష్ణ రాష్ట్రంలో లేకపోయినా ఆయన అభిమాన సంఘాలు ఆరోజు పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహించాలనీ, పుట్టినరోజును ఘనంగా జరపాలనీ సంకల్పించాయి. ఇక బాలకృష్ణ నటించిన 'పాండురంగడు' సినిమా రేపు (మే 30)న ప్రపంచమంతటా విడుదలతోంది. ఆ సినిమాకు సెన్సార్ పనులు సైతం ఇప్పటికే పూర్తయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X