»   » పవన్ కళ్యాణ్ రాక.. రంగస్థలం సక్సెస్ మీట్ కోసం భారీ స్థాయిలో!

పవన్ కళ్యాణ్ రాక.. రంగస్థలం సక్సెస్ మీట్ కోసం భారీ స్థాయిలో!

Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం బాహుబలి తరువాత టాలీవడో లో ఆ స్థాయి విజయంగా నిలిచింది. రాంచరణ్ కెరీర్ లో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా, నటన పరంగా అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కేవలం రెండు వారాలలోపే 150 కోట్ల గ్రాస్ వసూలుచేసింది. 100 కోట్ల షేర్ వైపు పరుగులు పెడుతోంది. చిత్రం ఇంతటి ఘన విజయం కావడంతో నిర్మాతలు సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని భావించారు.

Pawan Kalyan Watches Rangasthalam Movie Along With His Wife

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా రాంచరణ్, ఉపాసనతో కలసి రంగస్థలం చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిదే. రాంచరణ్, సుకుమార్ పై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. తాను సక్సెస్ మీట్ కు హాజరవుతానని ప్రకటించడంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నెల 14 న హైదరాబాద్ లో భారీ స్థాయిలో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు.

Grand Arrangements For Rangasthalam Success event

పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు హాజరు కానుండడంతో భారీ స్థాయిలో మెగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా నిర్మాతలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి ప్రేమ చిత్రం తరువాత తాను బయటకు వచ్చి చూసిన చిత్రం ఇదే అని పవన్ రంగస్థలం చూసాక అన్నారు.

English summary
Grand Arrangements For Rangasthalam Success event. Pawan Kalyan will attend this function as chief guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X