»   » 'అత్తారింటికి...' ఆడియో విడుదల తేదీ మార్పు(అఫీషియల్)

'అత్తారింటికి...' ఆడియో విడుదల తేదీ మార్పు(అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'అత్తారింటికి దారేది'. సమంత, ప్రణీత హీరోయిన్స్. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఆదివారం ఈ చిత్రంలోని గీతాల్ని విడుదల చేద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఈ నెల 19న పాటల్ని విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం గ్రాండ్ గా స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు.


''పవన్‌ శైలికి తగినట్టు ఉండే కథ ఇది. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. 'జల్సా' తరవాత పవన్‌-త్రివిక్రమ్‌ కలయికలో ఓ సినిమా వస్తోందటే అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. వాటన్నింటినీ అందుకొంటాం. జూలై 19న పాటల్ని, ఆగస్ట్ 7న సినిమాను విడుదల చేస్తాం. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్నిచ్చారు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది సినిమా. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం తప్పకుండా శ్రోతలకు నచ్చుతుంది'' అని నిర్మాత చెప్పారు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ నిర్మిస్తోంది. ఛత్రపతి ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం ఆవిష్కరించారు. పార్టీ నేపథ్యంలో సాగే ఓ పాటలో హంసానందిని, ముంతాజ్‌లు కనిపిస్తారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.

English summary
Power Star Pawan Kalyan’s keenly awaited film ‘Atharintiki Dharedhi’ has been confirmed for an August 7th release. Devi Sri Prasad has composed the music and a special audio launch is being planned by the producers. Special arrangements are being made to make this event a memorable one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu