»   »  ప్రాణాలు తీసిన ‘గ్రాండ్ మస్తీ’ బూతు కామెడీ!

ప్రాణాలు తీసిన ‘గ్రాండ్ మస్తీ’ బూతు కామెడీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమాల్లోని కామెడీ సన్నివేశాలు మనకు నవ్వు తెప్పిస్తాయి, అదే కామెడీ పొట్టచెక్కయ్యే రేంజిలో ఉంటే నవ్వి నవ్వి కడుపు నొప్పిపుడుతుంది. కానీ ఇపుడు నవ్వి నవ్వి ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'గ్రాండ్ మస్తీ' చిత్రం చూస్తూ విపరీతంగా వచ్చే నవ్వు ఆపుకోలేక 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.

మరణించిన యువకుడిని మంగేష్ భోగల్‌గా గుర్తించారు. ముంబైలోని వాసై వాసి. అతని గర్ల్ ఫ్రెండుతో కలిసి సినిమా చూడటానికి వచ్చాడు. కామెడీ సన్నివేశాలు చూస్తుండగా విపరీతంగా నవ్వడంతో అతనికి గుండె పోటు వచ్చింది. వెంటనే అతడిని వాసై వెస్ట్‌లోని కార్డినల్ గ్రాసియాస్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు గుర్తించారు.

మంగేష్ తన గర్ల్ ఫ్రెండుతో కలిసి కెటి విషన్ అనే మల్టీ ప్లెక్స్ థియేటర్లో సినిమా చూస్తుండగా ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఈ విషయాన్ని తనకు బాక్సాఫీసు ఉద్యోగులు ఫోన్ చేసి చెప్పారని, ఈ సంఘటన జరిగిన విషయం విని షాకయ్యానని థియేటర్ డైరెక్టర్ రాకేష్ షా తెలిపారు. పోలీసులు ఈ మరణాన్ని యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.

గ్రాండ్ మస్తీకి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో తెలుసుకుందా...

గ్రాండ్ మస్తీ

గ్రాండ్ మస్తీ


ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇంగ్లీష్ అడల్ట్ కామెడీ చిత్రాలను ఇన్స్‌స్పిరేషన్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, రితేష్ దేష్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని, మంజరి, కరిష్మా తన్నా, మరియమ్ జకారియా, బ్రూనా అబ్దుల్లా, కైనత్ అరోరా, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సినిమా కథ

సినిమా కథ


సినిమా కథ విషయానికొస్తే....ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇంట్లో భార్యలతో సంసార సుఖం లేని వారు.....ఎలాంటి అడ్డదారులు తొక్కారు, ఇబ్బందుల్లో ఇరుక్కుని ఎలా బయట పడ్డారు అనేది స్టోరీ. సినిమాలో అన్నీ సెక్స్ విషయాలతో కూడిన డబుల్ మీనింగ్ డైలాగులే.

బాక్సాఫీసు కలెక్షన్లు

బాక్సాఫీసు కలెక్షన్లు


గ్రాండ్ మస్తీ చిత్రానికి కలెక్షన్లు అదిరిపోతున్నాయి. సినిమాలోని బూతు కామెడీని, బూతు సీన్లను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేయడమే ఇందుకు కారణం.

పెద్దలకు మాత్రమే

పెద్దలకు మాత్రమే


పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈచిత్రం పూర్తిగా సెక్స్ రిలేటెడ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడి ఉంది. అడల్ట్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం తెగ ఎంటర్టెన్ చేస్తోంది. సెన్సార్ కట్స్ లేక పోవడంతో కొన్ని సీన్లు తీవ్రమైన అభ్యంతరకంగా ఉన్నాయి.

ఎంటర్టెన్మెంట్

ఎంటర్టెన్మెంట్


అయితే ‘గ్రాండ్ మస్తీ' చిత్రానికి ఇంత ఆదరణ దక్కడానికి కారణం....ఇలాంటి అడల్ట్ ఎంటర్టెన్మెంట్ చిత్రం ఇది వరకెప్పుడూ రాక పోవడం, సినిమా మొత్తం బూతు ఎంటర్టెన్మెంట్‌తో నవ్వుల వర్షం కురిపించడమే అని అంటున్నారు విశ్లేషకులు. యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఒక్క విషయం మాత్రం అర్థం అవుతుంది. ఎంటర్టెన్మెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా మనోళ్లు ఆదరిస్తారన్నమాట!

ఎవరితో కలిసి చూడాలంటే..?

ఎవరితో కలిసి చూడాలంటే..?


సినిమాలో ఎంటర్టెన్మెంట్ ఉన్నమాట వాస్తవమే. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా. ఈ సినిమాను స్నేహితులతో, లేక జీవిత భాగస్వామితోనో, లవర్‌తోనో కలిసి చూస్తే ఫర్వాలేదు. ఎంజాయ్ చేయొచ్చు. కానీ...ఇతర కుటుంబ సభ్యులతో చూస్తే మాత్రం ఇబ్బంది పడకతప్పుదు!

అదీ సంగతి

అదీ సంగతి


ఇటీవల విడుదలైన కహానీ, బర్పీ, 3 ఇడియట్స్, భాగ్ మిల్ఖా భాగ్ లాంటి అద్భుతమైన చిత్రాలకు భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మన ప్రేక్షకుల టేస్టు చాలా గొప్పది అని అంతా సంబర పడ్డాం. అయితే తాజాగా విడుదలైన ‘గ్రాండ్ మస్తీ' లాంటి బూతు చిత్రానికి కూడా కలెక్షన్లు భారీగా రావడం చూస్తే....మన ఆడియన్స్‌కు ఇలాంటి టేస్టును కూడా ఆస్వాదించే తత్వం ఉందని స్పష్టం అయింది.

ఆశ్చర్యమే

ఆశ్చర్యమే


బాలీవుడ్లో తాజాగా రిలీజై ‘గ్రాండ్ మస్తీ' చిత్రానికి ఎవరూ ఊహించని విధంగా కాసుల వర్షం కురుస్తోంది. ఇందులో ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమిటంటే ఇదో పరమ బూతు డబుల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉన్న సినిమా కావడమే. సెక్సు గురించి, సెక్స్ సంబంధమైన కామెడీ గురించి బహిరంగంగా మాట్లాడటానికే ఇష్టపడని భారతీయ సమాజం ఈ ఎక్స్ రేటెడ్ సినిమాకు కలెక్షన్ల పంట పండిస్తోంది.

బూతు డైలాగ్స్

బూతు డైలాగ్స్


నాకు రెండు పెద్ద పెద్ద పాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈరోజు రాత్రి నీకు వాటిని చూపిస్తాను. ఇందులో ఎంత డబుల్ మీనింగ్ ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది.(వివేక్ ఒబెరాయ్‌ని రాత్రి తన గదికి పిలిచే సందర్భంలో కైనత్ అరోరా ఈ డైలాగ్ చెబుతుంది)

కండోమ్ రిలేటెడ్ జోక్స్

కండోమ్ రిలేటెడ్ జోక్స్


ఈ చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్ డాక్టర్. ఓ పేషెంట్ లైంగిక సమస్యకు కండోమ్ ప్యాకెట్ ఇచ్చి వాడమని సలహా ఇస్తాడు. దాన్ని మందుగా భావించిన పేషెంట్....ఇది పాలతో వేసుకోవాలా? నీళ్లతో వేసుకోవాలా? అని అతన్ని అడుగుతుంది. ఈ జోక్ థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తోంది.

English summary
Have you ever laughed so hard that you feel you are going to die? Believe it or not! A 22-year-old boy had a sudden death as he was laughing while he was watching the recently released adult comedy Grand Masti. The boy, whose name is identified as Mangesh Bhogal had gone to watch the film along with his girlfriend. He laughed so much while watching the movie that he he suffered a sudden heart attack.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu