twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ తప్పూ చేయకుండానే రెండు అగ్ర పార్టీల మధ్య పాపం ఆ సీనియర్ నటి ఇరుక్కుపోయింది

    |

    'కన్నబిడ్డలే కూడు పెట్టలేదు, నాకు అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మనే' ఇది అన్నాడీఎంకే ఆధ్వర్యంలో అధినేత్రి పురిచ్చిత్తలైవిని ఆకాశానికెత్తుతూ సాగే ప్రకటన. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయలలిత చేపట్టిన 'అమ్మ క్యాంటీన్' పథకం వల్ల తమ కుటుంబం భోజనం చేస్తోందని, అన్నం పెట్టిన అమ్మకు ధన్యవాదాలు చెబుతున్నానంటూ రూపొందించిన యాడ్ ఫిల్మ్.

    ఈ యాడ్ లో నటించింది ధనుష్‌ నటించిన మయక్కం ఎన్న, విజయ్‌ సేతుపతి నటించిన ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమార సంతానం నటించిన ఇనిమే ఇప్పడిదాన్‌ తదితర చిత్రాల్లో సహాయ నటిగా చేసిన కస్తూరి, తమిళ సినిమాల్లో కస్తూరి పాటి (కస్తూరి అమ్మమ్మ) గా అందరికీ తెలుసు...

    ఆమె నటించిన ఈ అన్నాడీఎంకే ప్రచార వీడియో ప్రసారమైన కొద్ది సేపటికే "ఆకాశంలో ఎగిరేవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఇంకెందుకండి, చాలమ్మా..'."" అంటూ జయ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ డీఎంకే ఎన్నికల ప్రచార ప్రకటన కూడా ప్రసారం అయింది.. అయితే ఈ ప్రకటణలోనూ ఉన్నది కస్తూరి పాటి నే. ఒక పక్క జయని పొగుడుతూ,మరోపక్క ఆమెని ఓడించమని చెబుతూ ఉన్న ఈ రెండు ప్రచార ప్రకటనల దృశ్యాలు టీవీ ఛానెళ్లలో విసృత్తంగా రోజూ ప్రసారమవుతున్నాయి.

     "grandma" Kasturi in truble for 'Double' role jab

    ఒకే వ్యక్తి ఒకసారి జయలలితను ప్రశంసిస్తూ, మరోసారి విమర్శిస్తూ నటించిన ఈ రెండు వేర్వేరు ప్రకటనలను టీవీలు పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు వీడియో సన్నివేశాలనూ వాట్సాప్‌ గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేసారు. దీంతో వివాదం చెలరేగింది. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ప్రజలతో ఇలాంటి తప్పుడు సందేశాలను ఇప్పిస్తున్నారంటూ పలువురు ఆరోపించడంతో వ్యవహారం కాస్తా ముదిరి పాకానపడింది.

    దాంతో పాపం కస్తూరి పాటి కి కూడా సమస్యలు మొదలయ్యాయి. చెన్నై తేనాంపేటలోని గుడిసెలో నివసించే కస్తూరి మాత్రం తాను ఎంత చెప్పినా వినకుండా ఇలా రెండు ప్రకటనల్లోను తనచేత నటింపచేశారని వాపోయింది. 20 రోజుల కిందట అమ్మ ప్రకటన కోసమంటూ నటించడానికి తనను తీసుకెళ్లారనీ, అందుకుగాను తనకు రూ.1,500 ఇచ్చారనీ...

    ఆ తర్వాత కొద్దిరోజులకే మరో యాడ్‌ ఫిలిమ్‌లో నటించాలంటూ తీసుకెళ్లారని, అక్కడకు వెళ్లాక విషయం తెలిసిన వెంటనే ఆ ప్రకటన అమ్మజయలలితకు వ్యతిరేకంగా ఉందని, అప్పటికే తాను అన్నా డీఎంకే కు అనుకూలంగా నటించానని వాళ్లకు చెప్పినా. వాళ్ళు వినిపించుకోకుండా "ఫర్వాలేదులే" అని నటింపచేశారని, ఇందుకు గానూ తనకు రూ.1000 ఇచ్చి పంపించి వేశారని చెప్పింది. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకుంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమలాంటి వాళ్లకు మంచి చేయాలని మాత్రం కోరుకుంటానని చెబుతోంది ఈ తమిళ సినిమా అమ్మమ్మ.

    English summary
    Kasturi, who has an expressive facing problems for acting both party campaigning videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X