»   » ఆయన దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభవం..!?

ఆయన దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభవం..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభవం అని అంటున్నారు నటుడు సూర్య. వీరిద్దరి కాంబినేషన్‌ లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రక్త చరిత్ర చిత్రం భారీ ఎత్తున రూపొం దిన విషయం తెలిసిందే. తమిళంలో నైన్ క్లౌడ్ మూవీస్ పతాకంపై దయానిధి అళగిరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ మరో హీరోగా నటించారు. ప్రియమణి హీరోయిన్‌ గా నటించగా ఇతర ప్రధాన పాత్రలో శతృష్నుసిన్హా, రాధికా ఆప్లే, అభిమన్య సింగ్, కోటా శ్రీనివాసరావు తదితరులు నటించారు. ఆంధ్ర రాష్ట్రం లోని రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో రాయలసీమ రాజకీయవాది పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ఈయన ప్రత్యర్థి మద్దెలచెరువు సూరి పాత్రలో సూర్య నటించారు. ఈ చిత్రం ద్వారా సూర్య తొలిసారిగా బాలీవుడ్‌ కు పరిచయం కానున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నటించడమే గొప్పగా భావిస్తున్నానని ఇక బాలీవుడ్‌ కు పరిచయం అవడం అనేది మరపురాని అనుభవం అని సూర్య అంటున్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ మొత్తం ఎంతగానో శ్రమించిందన్నారు. చిత్రం విజయంపై అందరికీ నమ్మకం ఉందని సూర్య అన్నారు. కాగా ఈ చిత్రం దీపావళి కానుగా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu