»   » హీరోయిన్ తో సహా అంతా స్టేజీపై ఏడుపు, ఇది మర్డరే

హీరోయిన్ తో సహా అంతా స్టేజీపై ఏడుపు, ఇది మర్డరే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా ఫెయిలైతే భాధపడుతూంటారు. అయితే ఎక్సపెక్ట్ చేసిన సినిమా ధియేటర్లోకి వెళ్లకముందే లీక్ అయితే ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్దితి బాలీవుడ్ చిత్రం గ్రేట్ గ్రాండ్ మస్తీది. ఈ చిత్రం రిలీజ్ కు ముందే నెట్ లో వచ్చేసింది. దాంతో వందకోట్లు వస్తుందనుకున్న సినిమా మూడు కోట్లు దగ్గర ఆగిపోయింది. ఇది చూసిన యూనిట్, హీరో,హీరోయిన్స్ తో అంతా స్టేజీపై కన్నీరు పెట్టేసుకున్ారు.

'గ్రేట్ గ్రాండ్ మస్తీ' విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ కావడం.. ఈ సినిమా ఆశలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆన్ లైన్ లో లీకవ్వడంతో అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమాను ధియోటర్లలో రిలీజ్ చేసారు. అయినా, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. తొలి వీకెండ్ లో కేవలం రూ. 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో చిత్ర దర్శకుడు ఇంద్రకుమార్, హీరోలు వివేక్ ఒబరాయ్, రితేశ్ దేశ్ ముఖ్, ఆఫ్తాబ్ శివదాసని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

'Great Grand Masti' collections will make the entire team cry!

తొలి రోజు కనీసం 15 కోట్ల వసూళ్లు సాధిస్తుందనుకున్న సినిమా 2 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్ పైరసీ వల్ల తమకు జరిగిన నష్టాన్ని అభిమానులకు తెలియజేశారు.

ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిన హీరోయిన్ ఊర్వశీ రౌతేలా 'సినిమా 17 రోజుల ముందే లీక్ అయిపోయింది. అది చూసిన అందరూ సూపర్బ్ గా చేశారని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదు. ఇది హత్య చేయడం కన్నా ఎక్కువ' అంటూ ఏడ్చేసింది.

English summary
Urvashi Rautela recently broke down while talking about the disastrous performance of Great Grand Masti at the box office. She was addressing the issue of rampant piracy murdering her film and immediately lost control and started crying on stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu