»   » బూతును మరింత గ్రేట్‌గా చూపిస్తారు కాబోలు! (ఇదే ఆ ట్రైలర్)

బూతును మరింత గ్రేట్‌గా చూపిస్తారు కాబోలు! (ఇదే ఆ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినీ పరిశ్రమలో అడల్ట్ కామెడీ జేనర్స్ చాలా తక్కువే. పచ్చి బూతు సీన్లు, డబుల్ మీనింగ్ కామెడీ పంచ్ లతో కూడి ఉండే ఈ తరహా సినిమాలకు ఇకప్పుడు ఇండియాలో పెద్దగా ఆదరణ ఉండేది కాదు. అయితే హాలీవుడ్ సినిమాల ప్రభావంతో క్రమక్రమంగా ఇక్కడ కూడా అలాంటి సినిమాలకు ఆదరణ పెరుగుతోంది.

అందుకే ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రాలు బాలీవుడ్లో కామన్ అయ్యాయి. 2004లో 'మస్తీ' పేరుతో బాలీవుడ్ ఇలాంటి అడల్ట్ సెక్స్ కామెడీ సినిమా తీస్తే సూపర్ హిట్ చేసారు. ఆ తర్వాత 2013లో 'గ్రాండ్ మస్తీ' పేరుతో దానికి సీక్వెల్ తీస్తే రూ. 100 కోట్లకు పైగా వసూలయ్యాయి.

ఇదే క్రమంలో మూడో సీక్వెల్ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' పేరుతో రాబోతోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలయ్యింది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో హారర్ ఎలిమెంట్స్ కూడా జోడించారని స్పష్టమవుతోంది. ఈ మధ్య హర్రర్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుండడంతో, 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ'కి కాస్త హర్రర్‌ కూడా జోడించారు.

రితేష్‌ దేశ్‌ముఖ్‌, అఫ్తాబ్‌ శివదాసాని, వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా గ్లామర్‌ ఈ సినిమాలో హైలెట్ అంటున్నాను నిర్మాతలు. ట్రైలర్లో అమ్మడి అందాల ఆరబోత చూసి కుర్రోళ్లంతా సినిమా ఎప్పుడూ రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

స్లైడ్ షోలో ట్రైలర్ వీక్షించండి....

రిలీజ్ ఎప్పుడంటే...

రిలీజ్ ఎప్పుడంటే...

జులై 22న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆరితేరిన యంగ్ లేడీ

ఆరితేరిన యంగ్ లేడీ

బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు నిర్మించడంలో ఆరితేరిపోయిన యంగ్ లేడీ ఏక్తా కపూర్ ఈ సినిమాకు నిర్మాత.

బూతు చూసే జనాల సంఖ్య పెరిగింది

బూతు చూసే జనాల సంఖ్య పెరిగింది

2013తో పోలిస్తే ఇపుడు బూతు కామెడీ సినిమాలు చూసే జనాల సంఖ్య పోరిగింది కాబట్టి... అప్పటికంటే డబల్ కలెక్షన్ అంటే...కనీసం రూ. 200 కోట్లు వసూలు అవుతాయన

ట్రైలర్

ఇదే ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ' మూవీ ట్రైలర్

English summary
Watch Great Grand Masti Official Trailer, starring Riteish Deshmukh, Vivek Oberoi, Aftab Shivdasani, Urvashi Rautela, Pooja Bose, Mishti and others. Music composed by Anand Raj Anand. Directed by Indra Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu