»   » కులుమనాలిలో అల్లు అర్జున్ సిన్మా కోసం అద్భుత సెట్టింగ్

కులుమనాలిలో అల్లు అర్జున్ సిన్మా కోసం అద్భుత సెట్టింగ్

Subscribe to Filmibeat Telugu

అల్ల్ల్లు అర్జున్‌, వి.వి.వినాయక్‌ కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'బద్రీనాథ్‌' కోసం కులుమనాలిలో వేసిన సెట్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో తమన్నా కథానాయిక. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే కులుమనాలీలో చిత్రీకరణ మొదలైంది. 'బద్రీనాథ్‌' కోసం అక్కడ ప్రత్యేకంగా సెట్‌ని నిర్మించారు. ఆనంద్‌సాయి కళా దర్శకత్వంలో ఇది రూపొందింది. అక్కడే అల్లు అర్జున్‌, ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ అంశాలతోపాటు భావోద్వేగమైన ఘట్టాలతో అల్లుకున్న కథ అనీ, అర్జున్‌ పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి కథ: చిన్నికృష్ణ, మాటలు: రాజేంద్రకుమార్‌, రచనా సహకారం: విస్సు, ఛాయాగ్రహణం: రవివర్మ, సంగీతం: కీరవాణి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu