For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'గ్రీకు వీరుడు' ట్రైలర్ లాంచ్ లో అదరకొట్టిన నాగ్ (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాగార్జున, నయనతార కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'గ్రీకు వీరుడు'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ మంగళవారం రిలీజ్ అయ్యింది. సినిమా సంతోషం లా మళ్లీ ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంటున్నారు. కామాక్షి మూవీస్‌ పతాకంపై డి.శివప్రసాద్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.దశరథ్‌ దర్శకుడు. చిత్రాన్ని ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నారు.

  నాగార్జున మాట్లాడుతూ ''ఈ రోజుతో 'గ్రీకువీరుడు' షూటింగ్‌ పూర్తయింది. ఆ లుక్‌కి పూర్తిగా అలవాటుపడ్డాను.. అందులోంచి బయటకు రావాలనిపించడం లేదు అని చెప్పుకొచ్చారు. 'గ్రీకు వీరుడు' లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరథ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

  నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ...''చాలాకాలం తర్వాత నాగార్జున చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. నాగ్, నయనతార కాంబినేషన్‌లో సాగే ప్రేమకథ అన్ని వయసుల వారికీ నచ్చుతుంది. ఇందులో కొత్త నాగార్జునను చూస్తారు. మార్చిలో పాటలను విడుదల చేస్తాం'' అని తెలిపారు.

  ట్రైలర్ లాంచ్ ఫోటోలు...స్లైడ్ షోలో..

  నిర్మాతతో కలిసి నాగ్..కూల్ గా పంక్షన్ కి వస్తున్నప్పుడు...

  నాగార్జున మాట్లాడుతూ....కుటుంబమంతా కలిసి చూసేలా దశరథ్‌ సినిమా తీస్తాడు. వినోదం, భావోద్వేగాలను బాగా మేళవిస్తాడు. సంగీతాభిరుచి ఉంది. యువతరానికి ఏం కావాలో బాగా తెలుసు అని నమ్మకం వ్యక్తం చేసారు.

  మొదట 'గ్రీకు వీరుడు' టైటిల్‌ వద్దన్నాను. 'వీరుడు' చూసి ఇదేదో యాక్షన్‌ సినిమా అనుకొంటారేమో అనే అనుమానం వచ్చింది. నిజానికి ఆ పదానికి అర్థం కూడా తెలీదు. కానీ ఈ పేరే బాగుంటుందని అంతా ఒప్పించారు అని నాగ్ క్లారిఫై చేసారు.

  'శిరిడి సాయి చేస్తున్నప్పుడు ఓ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండిపోయాను. బాబా గురించి తెలుసుకొని, ఆయనకు దగ్గరయ్యా. వెంటనే 'సక్కూబాయ్‌.. గరమ్‌ చాయ్‌' అంటూ 'ఢమరుకం' కోసం డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది. ఆ తరవాత 'గ్రీకు వీరుడు' కోసం మరింత స్త్టెలిష్‌గా తయారయ్యా. 'శిరిడి సాయి' నుంచి 'గ్రీకు వీరుడు'గా మారడానికి కాస్త సమయం పట్టింది''అన్నారు నాగార్జున.

  టీజర్‌ సోమవారం సాయంత్రం నెట్‌లో పెట్టాం. దానికి వచ్చిన స్పందన నాలో ఉత్సాహాన్ని నింపింది అని నాగార్జున చెప్పారు.

  ఈ రోజు ఉదయం అఖిల్‌ ఫోన్‌ చేశాడు. 'నీ గ్లామర్‌ రహస్యం ఏమిటని మా స్నేహితులు అడుగుతున్నారు. నేనేదో సరదాగా గెడ్డం పెంచుతుంటే.. మీ డాడీని కాపీ కొడుతున్నావా? అని ఆటపట్టిస్తున్నారు డాడీ' అన్నాడు. ఆ మాట చాలా సంతోషాన్నిచ్చింది.

  తమన్‌ మంచి పాటలిచ్చాడు. తప్పకుండా యువతరానికి నచ్చుతాయి అని దర్శక,నిర్మాతలు అభిలషించారు.

  నిర్మాత మాట్లాడుతూ ''సినిమాలో నాగార్జున లుక్‌ చూస్తే 'మన్మథుడు' కంటే ముందు తీసిన సినిమానా?అనిపిస్తుంది. అంత అందంగా కనిపిస్తున్నారు. మార్చి మూడో వారంలో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

  మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, సంగీతం: తమన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేకానంద కూచిభొట్ల, సహ నిర్మాత: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాణం: కామాక్షి మూవీస్.

  అమెరికాలో ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేసే ఓ ప్రవాస భారతీయుడి కథ ఇది. తొలిసారి మాతృ దేశానికి వస్తాడు. ఇక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే ఈ సినిమా కథ.

  దర్శకుడు మాట్లాడుతూ...నేనీ స్థానంలో ఉన్నానంటే కారణం నాగార్జున. ఆయనతో చేసిన 'సంతోషం' నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది అన్నారు.

  నయనతార పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది..నాగార్జున పాత్ర అందరికీ నచ్చుతుంది ''అని దశరథ్ అన్నారు.

  English summary
  The trailer launch function of Nagarjuna and Nayanthara's upcoming film,'Greekuveerudu', under the direction of Dasarth has been done in the Annapurna studios 7 acre venture in Hyderabad. Nagarjuna, Dasarath, the producer D. Siva Prasad Reddy and the camera Man Anil Bandari have attended the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X