»   » మహేష్ ఖలేజా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిటీ సివిల్ కోర్టు

మహేష్ ఖలేజా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిటీ సివిల్ కోర్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా చిత్రం విడుదలకు సిటీ సివిల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఖలేజా పేరుతో కాకుండా మహేష్ ఖలేజా పేరుతో చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చునని కోర్టు తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం విడుదల కానున్న ఖలేజా విడుదలకు నిర్మాతలు సన్నద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 థియేటర్లలో గురువారం ఈ చిత్రం విడుదల కానుంది.

గత కొంతకాలంగా ఖలేజా చిత్రం శీర్షికపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయభాస్కర్ అనే నిర్మాత ఖలేజా టైటిల్ తనదేనని, దానిని సంవత్సరం క్రితమే నమోదు చేసుకున్నానని కాబట్టి ఖలేజా పేరుపై చిత్రం విడుదల కాకుండా స్టే విధించాలని కోర్టుకు వెళ్లాడు. అయితే ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ప్రకారం శీర్షిక నమోదైన తరువాత 20 శాతం చిత్రం పూర్తి కాకుంటే ఆ శీర్షికను వేరే వారు ఉపయోగించుకోవచ్చు. కాని విజయభాస్కర్ రెడ్డి ఆ పేరును నమోదు చేసుకోవటమే కాని ఇప్పటి వరకు చిత్రం ప్రారంభించిన దాఖలాలు లేవు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu