అన్ని కోట్లా...రికార్డ్ కలెక్షన్స్ దారి అబద్దమేనా?
హైదరాబాద్: హృతిక్ రోషన్ హీరోగా నటించిన క్రిష్-3 సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వసూళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయిందని నిర్మాత రాకేష్ రోషన్ చెప్తున్నారు. ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా 'క్రిష్ 3' ఇంకా కొత్త రికార్డులు సృష్టిస్తోందని దర్శకుడు రాకేష్ రోషన్ వాదిస్తున్నాడు. అయితే ఈ రికార్డ్ కలెక్షన్స్ అవన్నీ అబద్దం అని నిర్మాత క్రియేట్ చేస్తున్నవే అని అంటున్నారు.
'క్రిష్ 3'కి కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదంటున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి తాను సేకరించిన సమాచారం మేరకు 'క్రిష్ 3' ఇప్పటికే 500 కోట్లను వసూలు చేసిందని రాకేష్ చెబుతున్నాడు. ప్రభుత్వానికి చెల్లించిన వినోదపు పన్ను మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటే తన సినిమా ఇప్పటికే 500 కోట్లను మించి వసూలు చేసిందంటున్నాడు.
తాజాగా విడుదలైన ఇతర సినిమాల వల్ల 'క్రిష్ 3' కలెక్షన్లు మందగించాయని బాలీవుడ్‌లో కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'బ్లాక్ బస్టర్'గా నిలిచిన సినిమాకు అతిగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికైనా సినీ విశే్లషకులు వాస్తవ కలెక్షన్లను గమనించి తప్పుడు ప్రచారం మానుకోవాలంటూ ఆయన సలహా ఇస్తున్నాడు.

గతంలో రాకేష్ నిర్మించిన 'క్రిష్', 'ధూమ్ 2' తెలుగు,తమిళ భాషల్లో అనువాదం చేయగా హృతిక్‌కు మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్‌తో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా హృతిక్‌కు భారీగా 'ఫ్యాన్ ఫాలోయింగ్' ఏర్పడింది. గతంలో తాను నిర్మించిన 'క్రిష్'ను ప్రతి భారతీయుడు ఆస్వాదించాలన్న తపనతో డబ్బింగా చేయించి ఇతర భాషల్లో విడుదల చేయించినట్లు రాకేష్ గుర్తు చేస్తున్నాడు. దక్షిణాది ప్రేక్షకులూ తన సినిమాలను ఆదరించడం ఎంతో ఆనందం కలిగించిందని అంటున్నాడు.
'క్రిష్ 3'ని అనువాదం చేసి ఎప్పుడు విడుదల చేస్తారని దక్షిణాదికి చెందిన సినీ పంపిణీదారులు తనను పదే పదే అడిగారని తెలిపాడు. కన్నడ, మలయాళం కంటే తెలుగు, తమిళ భాషల్లో సినీ పరిశ్రమ బాగా విస్తరించిందని అంటున్నాడు. వాణిజ్యపరమైన కోణంలో ఆలోచించినా అనువాద చిత్రాలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉందని రాకేష్ విశే్లషిస్తున్నాడు. 'ఫిల్మ్ క్రాఫ్ట్' పతాకంపై రాకేష్ దర్శక, నిర్మాతగా రూపొందించిన 'క్రిష్ 3' నవంబర్ 1న విడుదల అయ్యింది.


Click it and Unblock the Notifications











