»   » స్పైడర్‌కు మరో ఎదురుదెబ్బ.. రజనీ, ప్రభాస్ దారిలో మహేశ్

స్పైడర్‌కు మరో ఎదురుదెబ్బ.. రజనీ, ప్రభాస్ దారిలో మహేశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పైడర్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటూ చివరి దశకు చేరుకొన్నది. ఒక్క పాట మినహా దాదాపు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలోనే జరుగుతున్నది. ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుకు అమ్మాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ హక్కులను అమ్మిన దాఖలు లేవనిది తాజా సమాచారం. అయితే భారీగా సొమ్ము చేసుకోవాలన్న నిర్మాతల ఆశలపై జీఎస్టీ నీళ్లు జల్లినట్టు తెలుస్తున్నది.

బిజినెస్‌లో 10 శాతం కోత

బిజినెస్‌లో 10 శాతం కోత

ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కారణంగా స్పైడర్ సినిమా బిజినెస్‌పై తీవ్ర ప్రభావం పడినట్టు సమాచారం. బిజినెస్ వల్ల వచ్చే ఆదాయంలో 10 శాతం మేర కోత పడే అవకాశం ఉందట. ఓవరాల్‌గా సినిమా రెవెన్యూను పరిగణనలోకి తీసుకొంటే ఈ మొత్తం భారీగానే ఉండే అవకాశం ఉంది.


Mahesh babu fun at sets with spyder team
జీఎస్టీ 100 కోట్లకు బొక్క

జీఎస్టీ 100 కోట్లకు బొక్క

స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రూ.100 కోట్ల రూపాయలను ఆర్జించాలన్నది చిత్ర నిర్మాత, దర్శకుడు మురుగదాస్ ప్లాన్. అయితే జీఎస్టీ నిబంధనల వల్ల బిజినెస్ రూ.80 కోట్ల మేరకు ఉండే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ.20 కోట్ల మేర పన్ను కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి.


రజనీ, ప్రభాస్ దారిలో మహేశ్

రజనీ, ప్రభాస్ దారిలో మహేశ్

ఇదిలా పక్కన పడితే ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రభాస్‌ దారిని మహేశ్‌బాబు ఎంచుకొన్నట్టు తెలుస్తున్నది. బాహుబలి తర్వాత స్పైడర్ పలు భాషల్లో హల్‌చల్ చేయడానికి సిద్ధమవుతున్నది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యే సినిమాగా స్పైడర్ ఓ ఘనతను సొంతం చేసుకోనున్నది. మహేశ్ కెరీర్‌లోనే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా స్పైడర్ భారీ ఎత్తున రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


హిందీ, తమిళ భాషల్లో ప్రిన్స్

హిందీ, తమిళ భాషల్లో ప్రిన్స్

స్పైడర్ సినిమా ద్వారా తమిళ, హిందీ భాషల్లో మహేశ్ రంగ ప్రవేశం చేస్తున్నాడు. హిందీలో ఈ సినిమాను ఏఏ ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేస్తున్నది. తమిళంలో మురుగదాస్ సొంతంగా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను అట్టహాసంగా ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.


దసరా కానుకగా స్పైడర్

దసరా కానుకగా స్పైడర్

స్పైడర్ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆగస్టులో నిర్వహించనున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా బరిలో బాలయ్య నటిస్తున్న పైసా వసూల్, జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాను ఢీ కొనడానికి సిద్ధమవుతున్నది.English summary
Super Star Maheshbabu is following Rajinikanth and Prabhas. After Baahubali next big movie in Tollywood is Spyder. Spyder is set release in multiple languages. Mahesh Babu makes his debut with Spyder in Kollywood and the movie is also releasing in Hindi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X