»   » మూడు దశాబ్దాల తర్వాత తెరమీదకి: ఇండియన్ క్లాసిక్ కావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది?

మూడు దశాబ్దాల తర్వాత తెరమీదకి: ఇండియన్ క్లాసిక్ కావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నసీరుద్దీన్‌ షా, షబానా ఆజ్మీ భార్యాభర్తలుగా నటించిన లిబాస్‌ బాలీవుడ్‌ సినిమాను దాదాపు30 ఏళ్ల తర్వాత థియేటర్లలో తొలిసారి విడుదల చేస్తున్నారు.1988లో హిందీ గీత‌ర‌చ‌యిత‌, ఆస్కార్ గ్ర‌హీత గుల్జార్ తీసిన లిబాస్‌ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. గుల్జార్‌ 83వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల విష‌యాన్ని జీ స్టూడియోస్ ప్ర‌క‌టించింది.

న‌సీరుద్దీన్ షా, ష‌బానా అజ్మీ

న‌సీరుద్దీన్ షా, ష‌బానా అజ్మీ

న‌సీరుద్దీన్ షా, ష‌బానా అజ్మీ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని, గుల్జార్ తాను ర‌చించిన `సీమ‌` అనే క‌థానిక ఆధారంగా తెర‌కెక్కించారు. ఇందులో అలనాటి న‌టులు రాజ్ బబ్బార్‌, సుష్మా సేత్‌, ఉత్ప‌ల్ ద‌త్‌, అన్నూ క‌పూర్‌, స‌వితా బ‌జాజ్‌లు కూడా న‌టించారు. ఈ చిత్రానికి ఆర్డీ బ‌ర్మ‌న్ సంగీతం స‌మ‌కూర్చారు.

22 ఏళ్ల త‌ర్వాత

22 ఏళ్ల త‌ర్వాత

అప్ప‌ట్లో విడుద‌ల‌కు నోచుకోని ఈ చిత్రాన్ని 22 ఏళ్ల త‌ర్వాత మొద‌టి సారి 2014లో గోవాలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌ద‌ర్శించారు. అంత‌కుముందు 1992లో బెంగుళూరులో జ‌రిగిన అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్ కూడా ప్ర‌ద‌ర్శించారు.

వివాదం కారణంగా

వివాదం కారణంగా

2017 చివ‌ర్లోగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు జీ స్టూడియోస్ తెలిపింది. ఈ సినిమా కథా రచయిత, దర్శకుడు గుల్జార్‌కు, సినిమా నిర్మాత వికాస్‌ మోహన్‌ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ సినిమా ఇన్నేళ్లు విడుదల కాకుండా ఆగిపోయింది. సినిమా ముగింపు తనకు నచ్చలేదని, దాన్ని మార్చాల్సిందిగా వికాస్‌ మోహన్‌ గుల్జార్‌ను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు.

విడుదల చేసే ప్రసక్తే లేదంటూ

విడుదల చేసే ప్రసక్తే లేదంటూ

అయితే తాను సినిమాను విడుదల చేసే ప్రసక్తే లేదంటూ మొండికేసిన వికాస్‌ మోహన్‌ సినిమాను మూలన పడేశారు. వికాస్‌ మోహన్‌ 2016 సంవత్సరంలో మరణించారు. ఆయన స్థానంలో సినిమా నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆయన కుమారుడు అముల్‌ మోహన్‌ ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.

సాధ్యమైనంత త్వరగా

సాధ్యమైనంత త్వరగా

జీ క్లాసిక్‌ సినిమాలతోపాటు లిబాస్‌ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తానని చెప్పారు. ఈ సినిమా పూర్తయిన నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన ఆర్‌డీ బర్మన్‌ పాటలకు ప్రశంసలు లభించాయి.

"సీమ" అనే చిన్న కథ ఆధారంగా

గుల్జార్‌ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన సంపూరణ్‌ సింగ్‌ కార్లా రాసిన ‘సీమ' అనే చిన్న కథ ఆధారంగా లిబాస్‌ సినిమాలో సీమగా షబానా ఆజ్మీ నటించగా, ఆమె భర్తగా నసీరుద్దీన్‌ షా నటించారు. సీమ పాత్రధారి షబానా తన బాల్య మిత్రుడు టీకే పాత్రధారి రాజ్‌ బబ్బర్‌తో వెళ్లిపోవడంతో ఆమె వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మనసును కట్టిపడేసే కథాకథనంలో ముగ్గురి పాత్రలు మనసుకు హత్తుకుంటాయనడంలో సందేహం లేదు.

English summary
Gulzar's 1988 film Libaas, starring Shabana Azmi and Naseeruddin Shah, to release after 29 years
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu