»   » ట్రిబ్యూట్: అనుష్క కు పదేళ్లు (వీడియో)

ట్రిబ్యూట్: అనుష్క కు పదేళ్లు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క అప్పుడే పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇండస్ట్రీకి వచ్చి అంటే ఆశ్చర్యమనిపిస్తుంది. నమ్మబుద్ది కాకపోయినా ఇది నిజం. అనుష్క పది సంవత్సరాలు కెరీర్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా గుణశేఖర్ టీమ్ వర్క్స్ ఓ వీడియోని రూపొందించి ట్రిబ్యూట్ గా విడుదల చేసింది. మీరూ ఆ వీడియోని చూడండి.


ఇక అనుష్క ప్రస్తుతం ‘రుద్రమదేవి', ‘బాహుబలి' అనే రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ‘రుద్రమ దేవి' చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ చేస్తోంది. అనుష్క భర్తగా రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ,మళయాళ వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు.


దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ కలవటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది


Gunaa Teamworks' tribute to AnushkaShetty

దీంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి' చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్ హీరో. ఈ చిత్రం కూడా తర్వలోనే విడుదలకు సిద్ధమవుతోంది.


ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

English summary
Gunaa Teamworks' tribute to AnushkaShetty on completing 10 years in the film industry! Take a bow Rani ‪#‎Rudhramadevi‬!
Please Wait while comments are loading...