»   » ప్రతాప రుద్రుడు ఆగిపోలేదు:గుణశేఖర్

ప్రతాప రుద్రుడు ఆగిపోలేదు:గుణశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారీ బ‌డ్జెట్ చిత్రాల్ని తెర‌కెక్కించ‌డంలో అనుభ‌వం ఉన్న మరో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్. బాహుబ‌లి ని ఇన్స్పిరేష‌న్ గా తీసుకొని గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని దాదాపు 70కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించాడు. బాహుబలి అంతటి రేంజ్ లో కాకపోయినా కాస్త భారీగానే ఈ చిత్రాన్ని నిర్మించి బాగానే లాభాల్ని తెచ్చుకున్నాడు.

తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో సైతం రుద్రమదేవి చిత్రాన్ని 3డి, 2డి ల్లో విడుదల చేసాడు గుణశేఖర్. ఈ సినిమా తెచ్చిపెట్టిన కాన్ఫిడెన్స్ తో రుద్రమదేవి చిత్రానికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడి కథని కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాంటూ ప్రకటించేసాడు గుణ శేఖర్.

అయితే "రుద్రమదేవి" హిట్ అయిన కూడా కొంత ఆర్థిక సమస్యలనెదుర్కొన్న గుణశేఖర్ మళ్ళీ భారీ బడ్జెట్ పెట్టి సినిమా అంటే అది ఇంకో సాహసమే ఔతుంది. చాలా మంది గుణ్శేఖర్ అలాంటి రిస్క్ తీసుకోడని కూడా భావించారు. కానీ ఇలాన్టి హిస్టారికల్ చిత్రాలు నిర్మించాలంటే మంచి నిర్మాతలు ముందుండి నడిపించాలి.

Gunasekhar Slashed away all the Rumors about Prataparudrudu

అయితే అలాంటి నిర్మాత గుణశేఖర్ కి దొరుకుతాడా అని చాలా మంది అనుకున్నారు. "ప్రతాపరుద్రుడు" స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే సినిమాని నిర్మించడానికి సిద్దంగా ఉన్నాను అని దిల్ రాజు తెలిపారు. ఇక అప్ప్టినుంచీ. ప్రతాపరుద్రుడి చరిత్రని వెతకటం లో పడ్డాడు గుణశేఖర్.'ప్రతాపరుద్రుడు' టైటిల్ ను కూడా రిజిష్టర్ చేయించాడు.

అయితే దానికన్నా ముందుగా ఆయన ఒక చిన్న సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నాడనీ., "ప్రతాపరుద్రుడు" భారీ బడ్జెట్ తోను, భారీ తారాగణంతోను, అంతకి మించిన శ్రమతోను కూడుకుని ఉన్నదే. పైగా ఆయన అనుకున్న ఆర్టిస్టుల డేట్స్ దొరకడానికి కొంత సమయం పట్టేలా వుందట. అందువలన ఈలోగా ఒక చిన్న సినిమా చేసే ఉద్దేశంతో ఉన్నాడని చెబుతూ కొన్ని వార్తలు రావటం తో ఇక ఆ ప్రాజెక్ట్ ని ఇప్పటికి పక్కన పెట్టేసినట్టే అనుకున్నారంతా..

కానీ తాను ప్రతాపరుద్రున్ని వదిలేది లేదంటున్నాడు గుణశేఖర్ అతని టీమ్ ఇప్పుడు ప్రతాపరుద్రుడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పరిశోధించే పనిలో ఉన్నారట. ఇక గుణశేఖర్ .. చరిత్ర కి సంబందించిన ఫ్రొఫెసర్లతోనూ సమావేశమవుతూ, వారి నుంచి స్పష్టమైన సమాచారాన్ని రాబడుతున్నాడట. ఈ పరిశోధన పూర్తయిన తరువాత స్క్రిప్టు పై కూర్చోవడం జరుగుతుంది. స్క్రిప్టు వర్క్ సంతృప్తికరంగా వచ్చాకే సెట్స్ పైకి వెళ్లాలనే నిర్ణయంతో గుణశేఖర్ ఉన్నాడని అంటున్నారు.

English summary
Rudhramadevi director Gunasekhar has put full stop to all the rumors about the casts of his upcoming film, Prataparudrudu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu