»   »  ఓరుగల్లు కోటలో అనూష్క 'రుద్రమదేవి'

ఓరుగల్లు కోటలో అనూష్క 'రుద్రమదేవి'

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : అనూష్క,గుణశేఖర్ కాంబినేషన్ లో 'రుద్రమదేవి' అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ త్రీడీ చిత్రం వరంగల్ లో లొకేషన్స్ చూసుకు వచ్చింది. వరంగల్‌ పేరు చెప్పగానే వేయి స్తంభాల గుడితో పాటు రాణీ రుద్రమదేవి కూడా గుర్తొస్తుంది. 13వ శతాబ్దపు కాకతీయుల వైభవాన్ని చరిత్ర పాఠాల్లో కథలు కథలుగా చెప్పుకొన్నాం. రుద్రమదేవి సాహస గాథ విని స్ఫూర్తి తెచ్చుకొన్నాం. అవన్నీ మా సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

  గుణశేఖర్‌ మాట్లాడుతూ ''వరంగల్‌లోని చారిత్రక కట్టడాల గురించి చరిత్రకారులతో ప్రత్యేకంగా మాట్లాడాను. అవన్నీ మా పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలకు తగినట్టుగా సెట్స్‌ నిర్మిస్తున్నాం. కళాదర్శకుడు తోట తరణి.. ఇందుకు సంబంధించిన స్కెచ్‌లు వేస్తున్నారు''అని చెప్పారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

  అలాగే "జర్మనీలో 3డి టెస్ట్ షూట్‌ను వారం రోజుల పాటు సక్సెస్‌ఫుల్‌గా జరిపాం. మా కళా దర్శకుడు తోట తరణితో కలిసి ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి వంటి చారిత్రక కట్టడాలను సందర్శించాం. వాటి గురించి కొంతమంది చరిత్రకారులతో చర్చలు జరిపాం. వాస్తవికత ఉట్టిపడేలా ఆ కట్టడాలను సెట్స్ రూపంలో తరణి నిర్మిస్తున్నారు. 13వ శతాబ్దపు కాకతీయ వైభవాన్ని 'రుద్రమదేవి'లో తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాం'' అని చెప్పారు.


  గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించ బోతున్నారు. భారతదేశపు తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా తయారవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే 3డి టెస్ట్ షూట్‌ను జర్మనీలో జరిపిన బృందం ప్రస్తుతం ఓరుగల్లులో చారిత్రక కట్టడాలను పరిశీలిస్తోంది ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్, కూర్పు: శ్రీకరప్రసాద్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: గుణశేఖర్.

  English summary
  Gunasekhar is back from Germany,where he did a 3D trial shoot of Rudrama Devi.Now, he is in Warangal, along with art director Thota Tharani, on a visit to historical sites like the Thousand Pillars Temple as part of the pre-production research. The movie will be India's first historical stereoscopic 3D film and Anushka will reprise the role of the Rudrama Devi showcasing the efforts and tribulations of the historic personality. Maestro Ilayaraaja is composing the tunes.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more