»   » అటు రామ్ చరణ్, ఇటు గుణశేఖర్ కెలుకుతున్నారు

అటు రామ్ చరణ్, ఇటు గుణశేఖర్ కెలుకుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొద్ది రోజులుగా పరిశ్రమ వర్గాల్లోను,టీవీ చానెల్స్ లోనూ హాట్ టాపిక్ గా రామ్ చరణ్, గుణశేఖర్ నిలుస్తున్నారు. వీరిద్దరికీ వేర్వేరు టాపిక్ లతో హాట్ టాపిక్ గా మారారు. మన సినిమాల్లో నటిస్తున్న పరభాషా హీరోయిన్లు ఫంక్షన్స్ హాజరు కావడానికి నిరాకరిస్తున్నారన్న డా.దాసరి విమర్శకు రాంచరణ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదు, హీరోయిన్లు బాగానే వస్తున్నారని కామెంట్ చేసేసరికి పూర్తి దుమారం రేగింది. దాసరి విమర్శపై కామెంట్ చేసే స్థాయి రాంచరణ్‌కి లేదని ఓ వర్గం ధ్వజమెత్తింది. ఇది టీవీ ఛానెల్లో కూడా గంటపాటు చర్చకి దారి తీసింది. అందరూ మర్చిపోయిందనుకున్న దాన్ని కెలుక్కున్నట్లైందని రామ్ చరణ్ ని అందరూ అన్నారు.

ఇది జరిగిన మరుసటి రోజునే ఎంఎస్‌రెడ్డి 'నాకథ" పుస్తకంలో దర్శకుడు గుణశేఖర్ మీద చేసిన కామెంట్స్ హైల్ ట్ గా మారాయి. మహేష్ తో చేసిన'ఒక్కడు" సినిమా తనతో చేస్తానని మాటిచ్చిన గుణశేఖర్ మాట తప్పాడని ఎంఎస్‌రెడ్డి ఆరోపిస్తూ పుస్తకంలో రాసారు. దీనికి స్పందించిన గుణశేఖర్ దీన్ని ఎంఎస్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నాడు. ఇది ఆయన నా కథ అనే చెప్పారు గానీ ఆత్మకథ అని చెప్పలేదు. కనుక ఆత్మపెట్టి ఈ పుస్తకం రచించలేదు. కేవలం కథలు అల్లుకున్నారు అని కొట్టిపారేశాడు. అలా గుణశేఖర్ వెంటనే ఆ పెద్దాయన్ని ఏకి పారేసాడు. అస్సలు ఆ పుస్తకాన్ని మార్కెట్లో నుంచి తీసేసే ప్రయత్నాల్లో ఎమ్.ఎస్ రెడ్డి కుమారుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉండగా గుణశేఖర్ ఇలా కెలికి దాన్ని హైలెట్ చేసారు. అదీ సంగతి.

English summary
Director Gunashekar gave a clarification on veteran producer MS Reddy's allegations on him. Gunashekar turned out all the comments and termed MS Reddy's autobiography as fictional.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu